తెలంగాణలో ఇంటర్ పరీక్షల ముహూర్తం ఫిక్స్, ముందుగా..!!

ఇంటర్ పరీక్షల ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసారు. ఫిబ్రవరి నెలాఖరులోనే పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ఏపీ ఇంటర్ షెడ్యూల్ విడుదల కావటంతో.. తెలంగాణలోనూ షెడ్యూల్ ప్రకటించి.. విద్యార్ధులకు ఇతర పరీక్షలకు సమాయత్తం అయ్యేలా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. దీంతో, పరీక్షల తేదీలను నిర్ణయించారు.

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు కసరత్తు వేగవంతం చేసారు. ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభం కానున్నాయి. 2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీ ఇంటర్​ పరీక్షలు ఫిబ్రవరి 23న మొదలై మార్చి 24తో ముగియనున్నాయి. అదే మాదిరిగా తెలంగాణలోనూ ప్రారంభించాలని నిర్ణయించారు.

Intermediate Board planning to conduct examination in February last week

అయితే, ఏపీ కంటే తెలంగాణలో పరీక్షలు ముందే పూర్తి కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ అధికారులు తాజా ప్రతిపాదనలు విద్యా శాఖ సైతం పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ కు సమర్పించారు. ఈ రోజు లేదా రేపు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోనే పరీక్షలు నిర్వహణ ద్వారా జేఈఈ మెయిన్​, ఎప్​సెట్​, నీట్ కు సన్నద్ధమయ్యే వారికి వెసులుబాటు దొరకనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పైన నిర్ణయానికి రావటంతో ఇక.. ఇంటర్ పరీక్షల ఫీజు పెంపు పైనా చ్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రాక్టికల్స్​ లేని కోర్సులకు రూ.520, ప్రయోగ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ గ్రూపులతో పాటు ఒకేషనల్​ కోర్సులకు అదనంగా మరో రూ.230 కలిపి మొత్తం రూ.750 వసూలు చేస్తున్నారు.

ఇక్కడ కొంత మొత్తం పెంచాలని బోర్డు ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదిస్తే ప్రాక్టికల్స్​ లేని కోర్సులకు రూ.600, ప్రాక్టికల్స్​ ఉన్న వాటికి రూ.875 వరకు పెరగవచ్చని తెలుస్తోంది. దీని పైనా నిర్ణయం ఈ రోజు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల పైన ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. దీంతో.. ఈ సారి ముందు గానే ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+