గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: విదేశీ యువతుల అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. ఈ వ్యభిచార కేంద్రంపై దాడి చేసిన పోలీసులు.. 17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర దేశాలకు చెందిన యువతులతో ఆన్‌లైన్ వెబ్ ద్వారా ఆర్గనైజ్డ్ గా వ్యభిచారం చేయిస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు, యాంటీ వుమెన్ ట్రాఫికింగ్ పోలీసులు తేల్చారు.

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్‌లోని ఒక ఇండిపెండెంట్ హౌస్‌లో ఈ సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు సదరు ఇంటిపై దాడి చేసి, సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఈ దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆ నివాసంలో ఎక్కువ సంఖ్యలో విదేశీ యువతులే ఉండటం గమనార్హం.

International sex racket busted in Gachibowli Hyderabad

కెన్యా దేశానికి చెందిన 14 మంది యువతులు, ఉగాండ, టాంజానియా దేశాలకు చెందిన ముగ్గురు.. ఇలా మొత్తంగా 17 మంది విదేశీ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సేఫ్ హౌస్ కు తరలించారు. ఈ సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్న నిర్వాహకుడు శివకుమార్ తోపాటు మరో ఇద్దరు విటులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

బీటెక్ విద్యార్థి దారుణ హత్య

రాచకొండ కమీషనరేట్​ బాలాపూర్‌ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండి 37 హోటల్‌కు సమీపాన ఉన్న ఓ పాన్​ షాపు దగ్గర విద్యార్థి మోండ్రు ప్రశాంత్‌ (21)పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+