హైదరాబాద్‌లో రన్ ఫర్ యాక్షన్
CV Anand: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా లోకానికి విషెస్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేకంగా 5కె రన్, 2కె రన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. 5,000 మందికి పైగా మహిళలు, విద్యార్థినులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడారు. రన్ ఫర్ యాక్షన్ అనే థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటోన్నామని అన్నారు. మహిళల భద్రత, మహిళా సాధికారత విషయంలో శరవేగంగా చర్యలను తీసుకోవాల్సి ఉందనేది ఈ థీమ్ ఉద్దేశమని వివరించారు.
అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళలకు సమానత్వ హక్కును కల్పించే దిశగా తమ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని అన్నారు. మహిళల పట్ల వివక్ష లేని సమాజాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో భాగంగా వివిధ నగరాలు, ఇతర దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మహిళలందరికీ రక్షణ కల్పిస్తోన్నామని అన్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీసులు ఎంతో కృషి చేస్తోన్నారని మంత్రి సీతక్క ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాలను అరికట్టగలుగుతున్నారని పేర్కొన్నారు. వారందరూ స్వేచ్ఛగా విధి నిర్వహణల్లో పాల్గొనగలుగుతున్నారని, దీనికి కారణం హైదరాబాద్ నగర పోలీసుల అకుంఠిత దీక్ష, చిత్తశుద్ధే కారణమని అన్నారు.












Click it and Unblock the Notifications