అండర్‌ వేర్‌లో ఫోన్‌: కీచైన్-కెమెరాకు లింకు!, సఫీర్ ఎంత తెలివిగా కాపీ కొట్టాడంటే..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: యూపీఎస్‌సి పరీక్షలో హైటెక్ మాస్ కాపీయింగ్ కు పాల్పడి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాడు సఫీర్ కరీం. అటు కేంద్రం, ఇటు సామాన్యులు ఒక్కసారిగా దీనిపై ఉలిక్కిపడ్డారు.

కరీం 'పెద్ద జాదూ': ఇలా హైటెక్ కాపీయింగ్.., సురేష్ గోపీ స్ఫూర్తి, విస్తుపోవాల్సిందే!

ఇప్పటికే పలు ప్రభుత్వ నియామక పరీక్షల్లో వెలుగుచూసిన కాపీ ఉదంతాలు, ఇప్పుడిలా ఏకంగా సివిల్స్ పరీక్షలోను అదే ఉదంతం వెలుగుచూడటం.. చాలామందికి లేని అనుమానాలను రేకెత్తించింది.

కరీం ఐఏఎస్ కావాలనుకోవడం వెనుక!: అప్పట్లోనే ఛాన్స్ వచ్చినా, వేటు పడొచ్చు..

మైక్రో ఫోన్, సెల్ ఫోన్ తో సఫీర్ కరీం పరీక్ష హాల్లోకి ఎలా వెళ్లగలిగాడు? సిబ్బంది ఆయన్ను ఎందుకు చెక్ చేయలేదు వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీటి వెనుక పలు ఆసక్తికర విషయాలు ఉన్నట్టు తెలిసింది.

 మూడు కార్లలో సెంటర్ వద్దకు:

మూడు కార్లలో సెంటర్ వద్దకు:

ఎలాగూ తాను ఐపీఎస్ అధికారి కాబట్టి.. పరీక్ష హాల్ వద్ద సిబ్బందికి కూడా ఆ విషయం తెలిసేలా ముందే ప్లాన్ చేసుకున్నాడు. తాను ఐపీఎస్ అని వారికి తెలిస్తే.. అంతగా చెక్ చేయకపోవచ్చునన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ వేశాడు. చూడగానే తాను ఐపీఎస్ అని అర్థమయేందుకు మూడు కార్లలో హల్ చల్ చేస్తూ పరీక్ష కేంద్రానికి వచ్చాడు. మూడు కార్లలో దిగేసరికి అక్కడున్న సిబ్బంది కూడా కరీంను పెద్ద ఆఫీసర్ అని భావించారు.

 సైబర్ నేరాల స్పెషలిస్ట్:

సైబర్ నేరాల స్పెషలిస్ట్:

సఫీర్ కరీం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చినవాడు కావడంతో సైబర్ నేరాలపై అతనికి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎంతటి క్లిష్టమైన సైబర్ కేసునైనా పరిష్కరించగలడన్న పేరు ఉంది. అయితే ఆ నైపుణ్యాన్ని, తెలివిని ఇలా అడ్డదారి తొక్కడానికి ఉపయోగించుకున్నాడు. చివారఖరికి అడ్డంగా బుక్కయి ఉన్న ఐపీఎస్ పోస్టును కూడా పోగొట్టుకునే దుస్థితి కల్పించుకున్నాడు.

 అండర్‌ వేర్‌లో ఫోన్‌:

అండర్‌ వేర్‌లో ఫోన్‌:

ఐఏఎస్ పరీక్షకు ముందు సఫీర్ బాగానే కసరత్తులు చేశాడు. ఇంటర్నెట్ ద్వారా హైటెక్ మాస్ కాపీయింగ్ గురించి లోతుగా అధ్యయనం చేశాడు. తొలుత తన సోదరి విషయంలో దీన్ని ప్రయోగించినట్టు తెలుస్తోంది. హైటెక్ మాస్ కాపీయింగ్ పద్దతిలో ఆమెతో సఫీర్ కరీం అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష రాయించినట్టు సమాచారం.

ఆమె విషయంలో అది ఫలితాన్నివ్వడవంతో.. తాను కూడా అదే తరహాలో పరీక్ష రాయాలనుకున్నాడు. ఇందుకోసం అండర్ వేర్ లో ఒక సెల్ ఫోన్, షర్టు బటన్ లో ఓ మైక్రో కెమెరా, వైర్ లెస్ హియర్ ఫోన్స్, బ్లూటూత్ తో పరీక్ష హాల్లోకి వెళ్లాడని దర్యాప్తులో తేలింది.

 ఇంత తెలివిగా కాపీ:

ఇంత తెలివిగా కాపీ:

షర్ట్ బటన్‌లో అమర్చిన సీక్రెట్ కెమెరాకు, తన చేతిలో ఉన్న కీ చైన్‌కు వైర్ లెస్ కనెక్షన్ ఉంటుంది. ప్రశ్నాపత్రంపై కీచైన్ పెట్టి.. దాని బటన్ నొక్కగానే షర్ట్ బటన్ లో ఉన్న కెమెరా దాన్ని ఫోటో తీసి నేరుగా గూగుల్‌ డ్రైవ్‌కు పంపుతుంది. అప్పటికే హైదరాబాద్ అశోక్ నగర్ లోని లా ఎక్సలెన్సీ అకాడమీలో భర్త మెయిల్ కోసం ఎదురుచూస్తున్న జోయ్ సి.. త్వర త్వరగా సమాధానాలు చేరవేస్తుంది.

ప్రశ్నాపత్రం ఫోటో రాగానే అందులో ప్రశ్నలకు అనుగుణంగా పుస్తకాల్లోని సమాధానాలు చూసి చెబుతుంది. కరీం తన చెవిలో పెట్టుకున్న మైక్రో చిప్ ద్వారా ఆ సమాధానాలు విని రాస్తాడు. ఒకవేళ వాయిస్ క్లారిటీ లేకపోతే.. జవాబు పత్రం పక్కభాగంలో 'నాట్ ఆడిబుల్' అని రాసి దాన్ని పంపించేవాడు. దీంతో ఆమె మళ్లీ చదివి వినిపిస్తుంటే సమాధానం రాసేవాడని పోలీసులు నిర్దారించారు.

ఇంటలిజెన్స్ నిఘా

ఇంటలిజెన్స్ నిఘా

చెన్నై, బెంగళూర్‌, తిరువనంతపురంలో కరీం ఐఏఏస్‌ కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తుండటంపై చెన్నై నిఘా వర్గాలకు 3 నెలల క్రితమే అనుమానం వచ్చింది. దీంతో అతడిపై నిఘా పెడుతూ వచ్చారు. పరీక్ష రాయడానికి వెళ్లే సమయంలో అతని కదలికలపై అనుమానం మరింత బలపడింది. దీంతో పరీక్ష హాల్లోనే తనిఖీలు చేసి హైటెక్ మాస్ కాపీయింగ్‌ను బట్ట బయలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police Service (IPS) officer Safeer Karim was taken into custody on Monday for cheating during the Civil Services (Main) Examination in Chennai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి