మండే ఎండల్లో హైదరాబాద్ TO డార్జిలింగ్.. తక్కువ ధరకే IRCTC సూపర్ ఆఫర్

పిల్లలకు సమ్మర్ హాలీడేస్ వచ్చేస్తున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే తక్కువ ధరకే డార్జిలింగ్ టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడి చల్లని వాతావరణం, ఎత్తయిన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం పర్యటకుల్ని అబ్బురపరుస్తోంది. ఈ మండే వేసవిలో శీతల ప్రాంతాల్లో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు తక్కువ ధరకే ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ డార్జిలింగ్ టూర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పశ్చిమ్ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతం ఎత్తయిన మంచు కొండలు, పచ్చని లోయలు, అద్భుతమైన తేయాకు పంటలకు ప్రసిద్ధి చెందింది. అందుకే వేసవిలో ఈ ప్రాంతానికి వచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారికోసమే ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ టూరిస్ట్ తక్కువ ధరకే ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఏంటి? ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఈ టూర్ లో భాగంగా తొలిరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానం స్టార్ట్ అవుతుంది. బగ్ డోగ్రా ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి డార్జిలింగ్ కు ప్రయాణం అవుతారు. రాత్రి డార్జిలింగ్ లో స్టే చేసిన తర్వాత రెండో రోజు తెల్లవారుజామున టైగర్ హిల్స్ కు వెళ్తారు. అక్కడ ఉన్న ఫేమస్ కాంచనజంగా పర్వత శిఖరాల నుంచి వెలువడే సూర్యుడిని చూస్తే మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది.

IRCTC Offers Affordable Hyderabad to Darjeeling Summer Tour Package Amid Scorching Heat best tour

ఆ తర్వాత హిమాలయన్ మౌంటెనిరింగ్ ఇన్ స్టిట్యూట్, జూపార్క్ ను సందర్శిస్తారు. టీ గార్డెన్ ను కూడా విజిట్ చేస్తారు. ఇక మూడో రోజు కాలిపాంగ్, మంగల్ ధామ్, డర్ఫిన్ ధారా హిల్స్ ను సందర్శిస్తారు. ఇక నాలుగోరోజు గ్యాంగ్ టక్ చేరుకుంటారు. ఐదోరోజు కూడా గ్యాంగ్ టక్ లోని అనేక టూరిస్టు ప్రాంతాలను సందర్శిస్తారు. అలాగే ఆరో రోజు సోమ్గో సరస్సు, సిలిగురి అందాలు చూస్తారు. తెళ్లారి బగ్ డోగ్రా విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. దాంతో టూర్ ముగుస్తుంది. ఇక ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+