సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు భారత్ గౌరవ్: ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే
Secunderabad-Ayodhya Punya Kshetra Yatra: ఉత్తరాదిన గల పలు ప్రఖ్యాత ఆలయాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. జ్యోతిర్లింగాలతో కూడిన అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీ ఇది.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగే యాత్ర ఇది. ఈ నెల 27వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, ఏపీలోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, ఒడిశాలోని బ్రహ్మపూర్, ఖుర్దారోడ్, భవనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్ స్టేషన్‌లల్లో ఈ ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం ఉంది.
ఈ ప్యాకేజీలో గయ- వారణాశి- అయోధ్య- ప్రయాగ్ రాజ్ ఉన్నాయి. గయలో విష్ణుపాద ఆలయం, వారణాశిలో కాశీ విశ్వనాథుడు, అక్కడి కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలను సందర్శించవచ్చు. అయోధ్యలో శ్రీరామచంద్రులవారి ఆలయం, హనుమాన్ గర్హి, హారతి, అత్యంత ప్రాచీనమైన సరయూ నదిని దర్శించవచ్చు.
ప్రయాగ్ రాజ్‌లో త్రివేణి సంగమంలో మహా కుంభమేళా పుణ్యస్నానాలను ఆచరించడంతో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ నుంచి మళ్లీ సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.
Feel the echoes of serenity wrapped in sacred spaces with the Ayodhya Kashi Punya Kshetra Yatra with Jyotirlinga aboard the Bharat Gaurav Tourist Train.
— IRCTC Bharat Gaurav Tourist Train (@IR_BharatGaurav) February 20, 2025
Confirm your booking today!https://t.co/jTosykDlGn
(Package Code = SCZBG37) pic.twitter.com/KfCxk3TQPh
ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,390 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,495 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. థర్డ్ ఏసీలో పెద్దలకు 23,600, పిల్లలకు 22,550 రూపాయలు, సెకెండ్ ఏసీ పెద్దలకు 31,160, పిల్లలకు 29,990 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications