నారాయణ 'ఆడియో టేప్' ట్విస్ట్: డబ్బులిచ్చి అలా.., లైంగికంగాను వేధించారన్న సరిత!

Subscribe to Oneindia Telugu
Narayana College Principal Audio Tape Leaked 'ఆడియో టేపు' లీక్ | Oneindia Telugu

హైదరాబాద్: నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల ఆడియో టేపు లీక్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. విద్యా సంస్థల ముసుగులో అసాంఘీక కార్యకలాపాలకు నారాయణ వేదికగా మారిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.

సంచలనం: నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ 'ఆడియో టేపు' లీక్, దిగ్భ్రాంతికర విషయాలు (వీడియో)

 డబ్బులిచ్చి మాట్లాడించారు

డబ్బులిచ్చి మాట్లాడించారు

ఆడియో టేపు లీకవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సరితా అగర్వాల్.. ఫోన్ సంభాషణలో తాను మాట్లాడిన మాటలు వేరే వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టు అని చెబుతుండటం గమనార్హం. అంతేకాదు, రూ.2లక్షలు ఇచ్చి తనతో అలా మాట్లాడించారని ఆమె ఆరోపించారు.

లైంగికంగా వేధించారు

లైంగికంగా వేధించారు

డబ్బు తీసుకుని, వారు రాసిచ్చింది మాట్లాడానని, ఇదే విషయాన్ని పోలీసులతోను చెప్పానని ఆమె పేర్కొన్నారు. తనను లైంగికంగా, మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. ఒకవేళ తాము చెప్పినట్టు మాట్లాడకపోతే.. తన పిల్లలను బతకనివ్వమని బెదిరించారని చెప్పారు. ఆ ఒత్తిడిలోనే తాను అలా మాట్లాడానని సరితా వెల్లడించారు.

తీవ్ర మానసిక వేదన

తీవ్ర మానసిక వేదన

డబ్బులు తీసుకుని మాట్లాడానని చెబుతున్న సరిత.. తనను అలా బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. పదేళ్లుగా తాను నారాయణలో పనిచేస్తున్నానని, ఇంత మానసిక వేదన మునుపెన్నడూ అనుభవించలేదని అన్నారు. తనకు ప్రాణ హాని ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

 విద్యాసంస్థలపై ఫిర్యాదులు:

విద్యాసంస్థలపై ఫిర్యాదులు:

నారాయణ, చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. జాతీయ బాలల హక్కు కమిషన్ కి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఆయన జాతీయ బాలల హక్కు కమిషన్ ఛైర్మన్ స్తుతి కకర్ ని కలిసి ఫిర్యాదు చేశారు.

కేవలం ఈ రెండు విద్యా సంస్థల్లో సంవత్సర కాలంలో 96మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇలా నారాయణపై చర్యలకు ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో.. ఆడియో టేపుల కలకలం కూడా కాలేజీ యాజమాన్యం తీరుపై పలు అనుమానాలకు తావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Leaked audio conversation of Narayana college staff was creating sensation, but Sarita who involved in this saying that it happened by force
Please Wait while comments are loading...