ఇదో స్పీడ్ బ్రేకర్, స్వల్ప కాలం మాత్రమే: పవర్ పాలిటిక్స్ అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సిరిసిల్ల: తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్, బీఆర్ఎస్ అని.. ఆ రెండింటిని ప్రజలు వదులుకోరని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. ఇది స్వల్ప కాలం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళుర్పించారు కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజలను ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా అభివృద్ధి, సంక్షమానికి పట్టం కట్టారన్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, నిర్మాణాత్మక ప్రతిపాక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ తెలిపారు. అనుకోని ఫలితాలను చూసి నిరాశపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పోరాటాల నుంచి వచ్చిన పార్టీ అని.. ఒడిదొడుకులు కొత్తేమీ కాదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజా గొంతుకై పోరాడుతామని స్పష్టం చేశారు.

తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను వదులుకోరన్నారు. ప్రస్తుతం ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని, ఇది స్వల్ప కాలం మాత్రమే ఉంటుందన్నారు. సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, ముందు పంచనని మాట ఇచ్చానని.. ఆ మాటను నిలబెట్టుకున్నానన్నారు. ప్రజలు కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టారని వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల పక్షాన మాట్లాడుతామని కేటీఆర్ చెప్పారు. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం పోవడం సహజం. ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తామన్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయి. కాగా, గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications