Assembly: 3 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు స్పీకర్ పోచ్రా శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం వరదలపై చర్చ జరపనున్నారు. 5వ తేదీ రోజు వివిధ బిల్లలుపై చర్చిస్తారు. ఆదివారం రోజు అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
కానీ స్పీకర్, ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు జరపాలని నిర్ణయించారు. అంతకు ముందు అసెంబ్లీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. సాయన్న కొద్ది నెలల క్రితం అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. సాయన్న సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సంతాప తీర్మాణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బలపరిచారు. ఈ సందర్భంగా ప్రజలకు సాయన్న చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ టర్మ్ లో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. మూడు, నాలుగు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని ప్రతిపక్షాలు చూస్తుండగా.. తాము చేసిన అభివృద్ధిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా జరిగి దాఖలలు లేపు. ఎప్పుడు సమావేశాలు నిర్వహించినా.. చాలా తొందరగా ముగించేవారు.
అసెంబ్లీ లాబీల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ ను కలిశారు. సంగారెడ్డికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి జగ్గారెడ్డి కేటీఆర్ తో చర్చించారు. జగ్గారెడ్డి చేసిన విజ్ఞప్తులపై కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కేటీఆర్, జగ్గారెడ్డి కలిసిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications