గోల్కొండ కోటలో చప్పట్లు కొట్టి ముచ్చటపడిన ఇవాంకా, మోడీ ఏం గిప్ట్ ఇచ్చారంటే...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ కాసేపు చిన్నపిల్ల అయిపోయారు. బుధవారం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె ముగ్ధురాలయ్యారు.
Recommended Video

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ కాసేపు చిన్నపిల్ల అయిపోయారు. బుధవారం గోల్కొండ కోటను సందర్శించిన ఆమె ముగ్ధురాలయ్యారు.
ఈ సందర్భంగా కోటలోని రాజప్రసాదంలో రాజు.. సేవకులు, సందర్శకులను పిలిచే విధానాన్ని వివరించినప్పుడు ఇవాంకా ఆశ్చర్యపోయారు. అక్కడ నిలబడి చప్పట్లు చరిచి ముచ్చటపడ్డారు.

అనంతరం కోట మధ్యలో నిలబడి గట్టిగా శబ్దం చేస్తే అది ప్రతిధ్వనించి తిరిగి మనకే చేరుతుందని తెలిపినప్పుడు.. ఇవాంకా అబ్బురంగా చూశారు. అద్భుతం.. అంటూ ఒక్క మాటలో గోల్కొండ కోట గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ దేశంలో ఇలాంటిది లేదని కూడా వ్యాఖ్యానించారు.
మరోవైపు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 2017 కోసం నగరానికి వచ్చిన అతిథి ఇవాంకా ట్రంప్ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఆయన ఓ చెక్క పెట్టెను ఇవాంకాకు బహుకరించారు.
అది సాదాసీదా పెట్టె కాదు.. సూరత్ కళ సడేలీ హస్తకళతో కూడింది. వివిధ ఆకృతులతో పెట్టెపై అల్లికలు ఉండటమే ఈ కళ ప్రత్యేకం. ఈ బహుమతి పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇవాంక.. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications