వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి వారే: జైపాల్, 'మోడీకి సహకరించండి.. లేదంటే మూసుకోండి'

రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లే వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి గురువారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లే వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి గురువారం అన్నారు. పార్టీలకు ఇచ్చే విరాళాల పైన ఆంక్షలు విధించడంపై మాట్లాడుతూ.. విరాళాలు ఇచ్చినట్లు చూపగలరా అని ప్రశ్నించారు.

బడ్జెట్‌లో పరిశ్రమలు లేవని, ఉద్యోగాల ఊసే లేదని చెప్పారు. అసలు మొత్తంగా కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో బయటపడిన నల్లధనాన్ని పేదలకు పంచుతామన్నారు కానీ బడ్జెట్‌లో అలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.

<strong>నిన్న పవన్... నేడు దత్తాత్రేయ: దాసరి బాగుంటేనే... మురళీ మోహన్</strong>నిన్న పవన్... నేడు దత్తాత్రేయ: దాసరి బాగుంటేనే... మురళీ మోహన్

పన్నుల తగ్గింపు నామమాత్రమే అన్నారు. రైల్వే బడ్జెట్‌లో అసలు కొత్త రైల్వే లైన్ల ఊసే లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని జైపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నోట్ల రద్దు ప్రకటన పని చేసినప్పుడు గాలితో నిండిన టైరులా ఉన్న ప్రధాని మోడీ, బడ్జెట్ తర్వాత పంక్చర్ అయిన టైర్ మాదిరిగా తయారయిందన్నారు. ఏ దిశ లేనటువంటి బడ్జెట్ ఇది అన్నారు. నిరర్థకమైన బడ్జెట్ అన్నారు.

బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట లభించలేదన్నారు. ఆర్థిక వ్యవస్థ చాలా సంక్షోభంలో ఉందని చెప్పారు. డెబ్బై ఏళ్లలో ఏనాడు ఇలాంటి నిరాశపూరిత బడ్జెట్ చూడలేదన్నారు. కొత్త రైల్వే లేన్లు లేవని, పరిశ్రమలు లేవన్నారు. నోట్ల రద్దు వల్ల ఆరు నెలల కష్టాలు, 3 నెలల నష్టాలు వచ్చాయన్నారు.

ఆలోచన లేని తొందరపాటుతో అహంభావి అయిన ప్రధాని తీసుకున్న చర్య నోట్ల రద్దు అన్నారు. సీఎం కేసీఆర్ దానికి మద్దతివ్వడం విడ్డూరమన్నారు. దీనిపై ఆయన సంజాయిషీ ఇవ్వాలన్నారు. పొలిటికల్ ఫండింగులో సంస్కరణలు నామమాత్రమేనని, నల్లధనం పార్టీల ద్వారా ప్రవహించడం లేదన్నారు. రూ.20వేలకు బినామీలను వెతుక్కున్న పార్టీలు ఇప్పుడు రూ.2వేలకు వెతుక్కుంటాయన్నారు.

Jaipal Reddy and Kishan Reddy on Union Budget

మోడీకి సహకరించండి లేదంటే.. నోరుమూసుకొని కూర్చోండి: కిషన్ రెడ్డి

అవినీతి నిర్మూలన కోసం చర్యలు చేపడుతున్న మోడీ ప్రభుత్వానికి సహకరించాలని లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి హెచ్చరించారు. కమ్యూనిజానికి కాలం చెల్లిందన్నారు. వారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.త

బడ్జెట్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఉందన్నారు. రాజకీయ పార్టీల విరాళాల పైన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు. ఆర్థిక సంస్కరణల దిశగా బడ్జెట్ ఉందన్నారు. కమ్యూనిస్యు నాయకులు బడ్జెట్ మొత్తం చదివి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ నేతలకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

English summary
Congress leader Jaipal Reddy and BJP leader Kishan Reddy on Union Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X