బర్రెలక్కకు మద్దతుగా జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం: టీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫుల్ సపోర్ట్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శిరీష అలియాస్ బర్రెలక్కకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మద్దతు లభించింది. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కను గెలిపించి భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి, బర్రెలక్కకు మద్దతుగా నిలవాలన్నారు. మంగళగిరిలో ఆదివారం వీజే కాలేజీలో రాజ్యాంగ దినోత్సవంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు చేసిన హెచ్చరికలను ప్రస్తావించారు.

ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన, వ్యక్తి పూజలు రాచరికానికి దారితీస్తాయని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మనకోసం మనం రాసుకున్న రాజ్యాన్ని పరిరక్షించాలంటే.. ఎన్నికల్లో డబ్బున్న వారికి కాదు.. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అందుకే తాను కొల్లాపూర్ బర్రెలక్క కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా ఇప్పటికైనా ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులతో బర్రెలక్క విజయానికి కృషి చేయాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
బర్రెలక్కకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బేషరతు మద్దతు
మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆమె కోసం మద్దతు ప్రకటిస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా ఆమె కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. . నిరుద్యోగులకు ప్రతినిధిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిల్చున్న ఆమెకు తాజాగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు. 'మా రక్ష' బర్రెలక్కకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తోందని ఆ పోస్టులో ఆయన వెల్లడించారు.

ప్రచారంలో తగ్గేదేలే అంటున్న బర్రెలక్క
నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష అలియాస్ బర్రెలక్క నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి మద్యానికి బానిసయ్యాడు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లితో కలిసి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుంది. ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ చేసి.. గ్రూప్-1, గ్రూప్-2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. ఎన్నోసార్లు ప్రయత్నించిన శిరీష.. ఇక తనకు ఉద్యోగం రాదంటూ.. అందుకే నాలుగు బర్రెలు కొనుక్కుని కాస్తున్నాంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల గురించి చెబుతూ ఓ రీల్ చేసింది.
బర్రెలక్కకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు..!#CVLNarasimhaRao #Barrelakka #BarrelakkaShirisha #Shirisha #Telangana #TelanganaElections2023 #Oneindiatelugu pic.twitter.com/oPgNYFLHVM
— oneindiatelugu (@oneindiatelugu) November 26, 2023
అయితే, 30 సెకన్లు ఉన్న ఆ రీల్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ కావడంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఆ ఫేంతోనే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంది. అనుకున్నదే తడవుగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. నామినేషన్ వేసిన తర్వాత పలువురి నుంచి బెదిరింపులు ఎదురైనా.. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నిరుద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న దృఢ నిశ్చయంతో ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పంచడమే మేనిఫెస్టోగా ముందుకెళ్తోంది. యువతతోపాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచారం దూసుకెళ్తున్నారు బర్రెలక్క.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications