కేసీఆర్ వచ్చినా ఇంతే: మహేష్ బాబు సినిమాకు జిట్టా ఝలక్, హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో శనివారం నుంచి జరగాల్సిన నటుడు మహేష్‌ బాబు తాజా సినిమా స్పైడర్‌ షూటింగ్‌ను అర్ధంతరంగా రద్దు చేశారు.

స్థానికుల అభ్యంతరం

స్థానికుల అభ్యంతరం

నిమ్స్‌ భవన సముదాయంలో వైద్య సేవలు ప్రారంభించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ, ఇందులో సినిమా షూటింగ్‌కు అద్దెకు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

జిట్టా హెచ్చరిక

జిట్టా హెచ్చరిక

సినిమా షూటింగ్ విషయం తెలిసి యువ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నిమ్స్‌ను సందర్శించారు. ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

కేసీఆర్ వచ్చినా అడ్డుకుంటాం

కేసీఆర్ వచ్చినా అడ్డుకుంటాం

దీనిపై నిమ్స్ డైరెక్టర్ స్పందించారు. షూటింగ్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. దీంతో షూటింగ్‌కు వచ్చిన వారంతా వెనక్కి తిరిగి వెళ్లారు. దీనిపై జిట్టా మాట్లాడుతూ.. జూలై నాటికి నిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాకుంటే ఇక్కడకు సీఎం కేసీఆర్ వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

సెట్టింగులు తొలగించి వెళ్లారు

సెట్టింగులు తొలగించి వెళ్లారు

కాగా, జిట్టా ప్రకటన, స్థానికుల నుంచి వ్యతిరేకత నేపథ్యంలో నిమ్స్ డైరెక్టర్ మనోహర రావు చిత్ర యూనిట్‌కు రెండు రోజుల క్రితమే లేఖ రాశారు. నిమ్స్‌లో షూటింగ్‌పై స్థానికంగా వ్యతిరేకత దృష్ట్యా నిలిపేయాలని పేర్కొన్నారు. దీంతో వారు పనులు నిలిపేసి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లను తొలగించి, వెళ్లిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jitta Balakrishna Reddy and Local people obstructed Actor Mahesh babu film shooting in Bibi Nagar NIMS.
Please Wait while comments are loading...