యువతకు గుడ్ న్యూస్.. ఈ జిల్లాలో మెగా జాబ్ మేళా..
తెలంగాణ యువతకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లాంటి నగరాలకు రాకుండా మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ లో ఈ నెల అక్టోబర్ 25న మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. దాదాపు 150 కంపెనీలు ఇక్కడకు వచ్చి నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయి. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళా సింగరేణి కాలరీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు.
25న హుజుర్ నగర్ లో జాబ్ మేళా.. pic.twitter.com/0MKchYrpIg
— Uttam Kumar Reddy (@UttamINC) October 19, 2025
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని యువతకు భారీ శుభవార్త. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లకుండానే సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. అక్టోబర్ 25 న హుజూర్ నగర్ లో మెగా జాబ్ మేళా జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. సింగరేణి కాలరీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దాదాపు 150 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. 2,000 నుంచి 5,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.

హుజూర్ నగర్ లోని సబ్- రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక ఉన్న పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో అక్టోబర్ 25 న ఉదయం 8 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభం కానుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ.. తదితర రంగాల్లో ఉత్తీర్ణులైన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. అలాగే వయో పరిమితిని 18 నుంచి 40 ఏళ్ల వరకు అని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 5 రెజ్యూమ్ లు తీసుకురావాలని అధికారులు సూచించారు. పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ జాబ్ మేళాను ప్రారంభించనున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాలో వైద్య సేవలు టాప్.. లెక్కలు చెప్పిన మంత్రి! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications