పరారీలో జానీ మాస్టర్..?

ప్రముక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. తన దగ్గర పని చేసే అస్టిస్టెంట్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అస్టిస్టెంట్‌ డ్యాన్స్ మాస్టర్ పోలీసుల ఫిర్యాదు చేసింది. 21ఏళ్ల యువతి ఆరు నెలలుగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తుంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.

అంతేకాకుండా అత్యాచారం కూడా చేశాడని, గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపింది. ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో, నార్సింగిలోని తన నివాసంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్‌ దగ్గర జాయిన్ మొదటి రోజు నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆ యువతి తెలిపింది. ప్రతీసారి తన సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయింది.

Johnny Master switched off the phone too

అంతేకాదు కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని.. షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో నా వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్‌ తీసి నాపై బలవంతం చేశాడని తన ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. నేను నో చెప్పేసరికి నా తలను అద్దంకేసి కొట్టాడు. మణికొండలోని నా ఫ్లాట్‌కు అర్ధరాత్రులు వచ్చి కోరిక తీర్చమని చాలాసార్లు నాపై దాడి చేశాడు. కానీ నేను ఏనాడు జానీ మాస్టర్‌కు లొంగలేదని ఆమె తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని.. నన్ను శారీరకంగా, మానసికంగా వేధించిన జానీ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోండి అంటూ ఫిర్యాదులో పేర్కొంది.

మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంత‌రం తదుపరి విచారణ కోసం ఆ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) ఎన్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు జానీ మాస్టర్ అందుబాటులోకి రాలేదని సమాచారం అందుతోంది. ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు, ఫోన్ సైతం స్వీచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు అక్కడ నుంచి వెనుతిరిగారని తెలుస్తోంది. జానీ మాస్టర్ వెలుగులోకి వస్తే కానీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+