వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా వీరే కడియంకుబిగ్ రిలీఫ్;ఊహించని నేతకు మంత్రి ఛాన్స్?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్యే కోటా లోని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టిఆర్ఎస్ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే . ఈ జాబితాలో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు స్థానం దక్కుతుండటం ఉమ్మడి వరంగల్ జిల్లా లో చర్చనీయాంశంగా మారింది. విపరీతమైన పోటీ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నప్పటికీ, ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వడంతో, అందులో ఒకరికి ఊహించని విధంగా మంత్రిగా అవకాశం రానుందని, నక్క తోక తొక్కి వచ్చారని వారిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చ జరుగుతుంది.

ఎమ్మెల్సీగా ఛాన్స్ .. కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్

ఎమ్మెల్సీగా ఛాన్స్ .. కడియం శ్రీహరికి బిగ్ రిలీఫ్


ఇంతకీ తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఖరారు చేసిన వారు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి అంటే? గతంలో టిఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పోషించిన, డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరిని ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కడియం శ్రీహరి కెసిఆర్ మంత్రివర్గంలో కీలకంగా పని చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా లోనూ మంత్రి హోదాలో చక్రం తిప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ క్యాబినెట్ లో ఆయనకు స్థానం దక్కలేదు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి పదవి కాలం 2021 జూన్ 3వ తేదీతో ముగిసింది.

జిల్లాలో పార్టీలో ప్రాధాన్యం లేక ఇబ్బంది పడుతున్న కడియం శ్రీహరి

జిల్లాలో పార్టీలో ప్రాధాన్యం లేక ఇబ్బంది పడుతున్న కడియం శ్రీహరి

ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగియడంతో కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన కడియం శ్రీహరి, మంత్రి పదవి లేక, ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగియడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీలోనే ప్రాధాన్యత లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ సమయంలో తిరిగి కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. దీంతో కడియం శ్రీహరికి కాస్త ఊరట లభించినట్లయింది.

 తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీగా ఛాన్స్ .. విధేయతకు పట్టం

తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీగా ఛాన్స్ .. విధేయతకు పట్టం

ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న మరో నేత, గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు. సీఎం కేసీఆర్ కు పరమ విధేయుడిగా పార్టీ కోసం పని చేస్తున్న తక్కెళ్లపల్లి రవీందర్ రావు కు అవకాశం ఇచ్చారు కెసిఆర్. ప్రస్తుతం వరంగల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు గా పనిచేస్తున్న తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అనేకమార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఆశించి భంగపడ్డారు.

గతంలో ఎర్రబెల్లి కోసం తక్కెళ్లపల్లి త్యాగం... గుర్తించిన కేసీఆర్

గతంలో ఎర్రబెల్లి కోసం తక్కెళ్లపల్లి త్యాగం... గుర్తించిన కేసీఆర్

మొదట్లో ఎర్రబెల్లి దయాకర్ రావుకు పాలకుర్తి టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అనేకమార్లు సర్దుకుపోయిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు కు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని టిఆర్ఎస్ పార్టీ నేతల్లో చర్చ జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కోసం ఎంత చక్రం తిప్పినా లాభం లేకపోయింది. ఫైనల్ గా తక్కెళ్లపల్లి రవీందర్ రావు పేరును ఫైనల్ చెయ్యటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అనూహ్యంగా ఎమ్మెల్సీ తెరమీదకు వచ్చిన రాజ్య సభ సభ్యుడు బండా ప్రకాష్ పేరు

అనూహ్యంగా ఎమ్మెల్సీ తెరమీదకు వచ్చిన రాజ్య సభ సభ్యుడు బండా ప్రకాష్ పేరు


ఇక అనూహ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి తెరమీదకు వచ్చిన మరో ఎమ్మెల్సీ అభ్యర్థి బండ ప్రకాష్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బండ ప్రకాష్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు. 2018లో రాజ్యసభకు టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికైన బండ ప్రకాష్ 2018 - 2019 సంవత్సరాలలో ప్రాచీన స్మారక కట్టడాలపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2019 సంవత్సరంలో కార్మిక చట్టాలు సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019 జూన్ లో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో టిఆర్ఎస్ పక్ష ఉప నాయకుడిగా బండ ప్రకాష్ నియమితుడయ్యాడు.

బండా ప్రకాష్ కు మంత్రి వర్గంలో ఛాన్స్

బండా ప్రకాష్ కు మంత్రి వర్గంలో ఛాన్స్

బండ ప్రకాష్ పేరును టిఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బండ ప్రకాష్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందుకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని, ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం కోసమే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మాజీ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గం కావడంతో ఆయన స్థానంలో బండ ప్రకాష్ కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.

English summary
Joint Warangal district leaders Kadiyam Srihari, Thakkellapalli Ravinder Rao and Banda Prakash were given the opportunity to be TRS MLCs by CM KCR. While this decision is a big relief to Kadim,talk that Banda Prakash will get a chance to become a minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X