జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్: నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇదే
హైదరాబాద్ లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో- అన్ని రాజకీయ పార్టీలూ దీనిపై దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నాయి. ఈ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ రాష్ట్ర సమితి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ సైతం అభ్యర్థిని నిలబెట్టబోతోంది. నవంబర్ 11వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుంది.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.

తాజాగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. నేటి నుంచి నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్లను దాఖలు చేయడానికి తుది గడువు.. ఈ నెల 21వ తేదీ. 22న నామినేషన్ల పరిశీలిస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి 24వ తేదీ వరకు గడువు ఉంది. అప్పటివరకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు. 16 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను షేక్‌పేట ఎమ్మా ర్వో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన సువిధ పోర్టల్ నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను పొందవచ్చు. కాగా 15న మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 17న నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి ఎవరనేది నేడో, రేపో అధికారికంగా వెల్లడి కావచ్చు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు. 25 మంది ఇతరులు ఉన్నారు. వీరందరూ నవంబర్ 11వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త శాసన సభ్యుడిని ఎన్నుకుంటారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్, గెలిచి తీరడానికి కాంగ్రెస్, బీజేపీ తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే?












Click it and Unblock the Notifications