నామినేషన్ స్క్రూటినీ వేళ సునీతపై సంచలన ఫిర్యాదు - ఈసీ కీలక నిర్ణయం..!!

జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత పైన సంచలన ఫిర్యాదు వచ్చింది. మాగంటి గోపీనాథ్ వారసుడిని తానే అంటూ తారక్ ప్రద్యుమ్న తెర పైకి వచ్చారు. తన తల్లి మాలినీ దేవిని గోపీనాథ్ వివాహ చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారని తెలంగాణ ఎన్నికల అధికారికి లేఖ రాసారు. సునీత ఎన్నికల అఫిడవిట్ లో చెబుతున్న వివరాల్లో నిజం లేదని ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయంగా అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కీలక అంశం తెర మీదకు వచ్చింది. బీఆర్ఎస్ సునీత పైన ఫిర్యాదులను ముందుగానే అంచనా వేసింది. దీంతో, పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డి తో మరో నామినేషన్ దాఖలు చేయించింది. ఇప్పుడు ఊహించినట్లుగానే సునీత పైన మాగంటి గోపీనాధ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

jubilee-hills-returning-officer-key-decision-over-sunitha-nomination-after-completion-of-scrutiny

సునీత మాగంటి భార్య కాదని ఆరోపించారు. అంతేకాకుండా సునీత నామినేషన్ రద్దు చేయాలని ఈసీకి ప్రద్యుమ్న వినతి చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి లేఖ రాసారు. మాగంటి ఎమ్మెల్యే అఫిడవిట్‌లో తన తల్లి మాలిని పేరు చూపించకుండా సునీత పేరు పెట్టారని.. తన తల్లి మాలినితో గోపీనాథ్‌కు విడాకులు కాలేదని ప్రద్యుమ్న తన ఫిర్యాదులో వివరించారు.

మాగంటి గోపినాథ్‌తో సునీత లీవ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు పరిశీలించిన ఎన్నికల అధికారులు మాగంటి గోపీనాథ్‌కు సునీతా గోపినాథ్ రెండో భార్య అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని స్పష్టం చేసారు. ఈ వ్యవహారం కోర్టులో తేల్చు కోవాల్సి ఉంటుందని సూచించారు. దీంతో మాగంటి సునీత నామినేషన్‌కు లైన్ క్లియర్ చేసారు. అదే సమయంలో సునీతకు మరింత సమాచారంతో డిక్లరేషన్ దాఖలు చేయాలని సూచించారు.

అటు సునీత నామినేషన్ సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా.. పార్టీ అభ్యర్దిగా పోటీ చేసేలా విష్ణు వర్ధన్ రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. ఇప్పుడు సునీత నామినేషన్ ఆమోదం పొందటంతో.. ఉప సంహరణ సమయంలోనే విష్ణు తన నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. ఇక, రేపు (గురువారం) కేసీఆర్ పార్టీ నేతలతో జూబ్లీహిల్స్ ఎన్నికలో అమలు చేయాల్సిన వ్యూహాల పైన దిశా నిర్దేశం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+