గీతాఆర్ట్స్ ముందు నగ్నంగా మహిళా ఆర్టిస్ట్ ధర్నాయత్నం; గతంలోనూ ఆత్మహత్యా యత్నం

సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతుందా? మహిళా ఆర్టిస్టులు నడిరోడ్డు మీదకు ఎక్కడం వెనుక అసలు జరుగుతున్నదేమిటి? అన్న చర్చ మహిళా ఆర్టిస్టులు రోడ్డు మీదకు వచ్చినప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తోంది. అయితే తమను మోసం చేశారని కొందరు జూనియర్ ఆర్టిస్టులు చేస్తున్న ఆరోపణలు పట్టించుకునే వారు లేరన్నది సినీపరిశ్రమలో అందరూ అంగీకరించే వాస్తవం.

తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న గీతాఆర్ట్స్ ముందు ఓ మహిళ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించింది. గీతా ఆర్ట్స్ పై తన నిరసనను తెలియజేయడానికి గీతా ఆర్ట్స్ భవనం ముందు కూర్చొని ధర్నా చేసిన మహిళ, గీతా ఆర్ట్స్ వారు తనకు డబ్బు ఇవ్వాలంటూ, తనను మోసం చేశారంటూ పెద్ద ఎత్తున ఏడుపు లంకించుకుంది. పోలీసులు సదరు మహిళను ఎంతగా ప్రశ్నించినా, సరిగ్గా సమాధానం చెప్పకుండా గీతాఆర్ట్స్ భవనం గేటు ముందు కింద పడి మరీ బోరున విలపించింది.

Junior female artist tried for nude protest in front of Geetha Arts; Suicide attempt in the past

అయితే ఈ మహిళనే గతంలో గీతా ఆర్ట్స్ గేటు ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ ఆర్టిస్ట్ అని భావిస్తున్నారు. గతంలో కత్తి మహేష్ పై క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కిన జూనియర్ ఆర్టిస్ట్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ యజమానిపై కూడా సంచలన ఆరోపణలు చేసి రచ్చ సృష్టించింది. గతేడాది కూడా గీతాఆర్ట్స్ భవనం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హల్ చల్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్లీ గీతాఆర్ట్స్ భవనం ముందు నగ్న ప్రదర్శన ద్వారా తన నిరసనను వ్యక్తం చేయడానికి ప్రయత్నించింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు జూనియర్ ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే గీతాఆర్ట్స్ భవనం ముందు గతంలోనూ హల్చల్ చేసిన సదరు మహిళా ఆర్టిస్టు మానసిక పరిస్థితి బాగోలేదు అంటూ పోలీసులు ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి లో చేర్పించి చికిత్స చేయించారు. ఇక ఇదే విషయాన్ని కోర్టుకు కూడా పోలీసులు తెలిపారు. మళ్లీ తాజాగా ఆమెను అరెస్ట్ చేయడంతో గీతాఆర్ట్స్ ముందు జూనియర్ ఆర్టిస్ట్ వ్యవహారం మరోమారు చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+