Kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం, అసలు జరిగిందిదే!
Singer Kalpana: సింగర్ కల్పన ఆత్యహత్య యత్నానికి పాల్పడలేదని ఆమె కుమార్తె దయ స్పష్టం చేశారు. కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, తమ ఎలాంటి తప్పుడు వార్తలు రాయవద్దని కోరారు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
తన తల్లి కల్పన సింగర్ మాత్రమే కాదు.. ప్రస్తుతం ఎల్ఎల్‌బీ , పీహెచ్‌డీ కూడా చేస్తున్నారని దయ తెలిపారు. ఇటీవల ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారని, వైద్యుల సూచన మేరకు టాబ్లెట్లు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే, ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్లే తన తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లారని వెల్లడించారు.

అంతేకానీ, కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని దయ తెలిపారు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దన్నారు. తమ కుటుంబమంతా సంతోషంగా ఉందని. తన తల్లిదండ్రులు కూడా ఆనందంగా జీవిస్తున్నారని దయ తెలిపారు. త్వరలోనే తన తల్లి ఇంటికి వస్తారని చెప్పారు.
కాగా, హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని విల్లాలో ఉంటున్న కల్పన మంళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చప్పారు. ఆయన వెంటనే కాలనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పడంతో వారొచ్చి.. తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కల్పన హెల్త్ బులిటెన్
కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కల్పన ఊపరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని వెల్లడించారు.
కల్పన ఏమన్నారంటే?
తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదన్నారు సింగర్ కల్పన. తన కుమార్తె విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగా నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు ప్రె నోట్ విడుదల చేశారు. తాను ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తనకు, తన కుమార్తెకు చదువు విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థలతో నిద్రపట్టక అధిక మొత్తంలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని కల్పన చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications