టీ కాంగ్రెస్ తో హైకమాండ్ కు కొత్త టెన్షన్ - రంగంలోకి ట్రబుల్ షూటర్..!!

తెలంగాణలో ఎన్నికల రాజకీయం ఆసక్తిగా మారుతోంది. హ్యాట్రిక్ కోసం కేసీఆర్..ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ ఏ స్థాయిలో పోటీ ఇస్తుందనేది ఇప్పుడు కీలక అంశం. ఇక, ఇప్పటికే హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం..గ్యారంటీల ప్రకటన ద్వారా కాంగ్రెస్ ఈ సారి అధికారం పైన భారీ అంచనాలతో ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ హైకమాండ్ మరో కలక నిర్ణయం తీసుకుంది. ట్రబుల్ షూటర్ ను రంగంలోకి దించింది.

హైకమాండ్ ఫోకస్ : కర్ణాటకలో విజయం తరువాత తెలంగాణలో అధికారం పైన కాంగ్రెస్ లో ఆశలు పెరిగాయి. పార్టీలో చేరికలతో మరింత నమ్మకం కనిపిస్తోంది. పార్టీ అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు కొనసాగుతోంది. ఇక, ఏ క్షణమైనా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకే సారి మొత్తం అభ్యర్దులను ప్రకటిస్తామని కాంగ్రెస్ చెబుతోంది.

Karnataka DY CM DK Shiva Kumar to take key responsibilities for Telangana Congress

నేతలంతా సమన్వయంతో పని చేస్తే గెలుపు సాధ్యమని పార్టీ నాయకత్వం పదేపదే సూచిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు..నేతల మధ్య విభేదాలు పార్టీ విజయావకాశాలను దూరం చేస్తుందనే ఆందోళన ఉంది. దీంతో, కొత్త ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి థాక్రే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

రంగంలోకి డీకే : ఎన్నికల వేళ పార్టీ నిర్ణయాలు..అభ్యర్దుల ఖరారు విషయంలోనూ నేరుగా హైకమాండ్ పరిశీలన చేస్తోంది. సహజంగా టీపీసీసీకి ఇచ్చే ప్రాధాన్యత పక్కన పెట్టారు. ఢిల్లీ స్థాయిలో తుది నిర్ణయాలు జరుగుతున్నాయి. అభ్యర్దులను ప్రకటించిన తరువాత పార్టీలో వచ్చే స్పందనలు..గ్రూపుల వ్యవహారాల పర్యవేక్షణకు హైకమాండ్ మరో నిర్ణయం తీసుకుంది.

పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ను రంగంలోకి దించుతోంది. షెడ్యూల్ విడుదల నుంచి పోలింగ్ వరకు హైదరాబాద్ లోనే మకాం వేయాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. నేతల మధ్య ఐక్యత...ప్రచారం..ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలకు ధీటుగా కార్యాచరణ బాధ్యతలను డీకేకు అప్పగించారని తెలుస్తోంది.

Karnataka DY CM DK Shiva Kumar to take key responsibilities for Telangana Congress

హోరా హోరీ రాజకీయం : ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్, ప్రియాంక సైతం ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని నిర్ణయించారు. స్టార్ క్యాంపెయినర్ల ప్రచార షెడ్యూల్... క్షేత్ర స్థాయిలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనేది పూర్తిగా డీకే శివకుమార్ కు బాధ్యతలు అప్పగించారు.

ప్రియాంక గాంధీతో సమన్వయం చేసుకుంటూ డీకే శివకుమార్ తెలంగాణ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకుంటున్నారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు సంక్షోభాలు ఏర్పడిన సమయంలో వాటి పరిష్కారంలో సక్సెస్ అయిన డీకే శివకుమార్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ గెలుపులో ఏ మేర సక్సస్ అవుతారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+