పవన్, నీ తల ఎక్కడపెట్టుకుంటారో: పూనంపై కత్తి తీవ్ర వ్యాఖ్యలు, కౌర్ కూడా అంతే

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు కొనసాగిస్తూ.. ఆయన అభిమానుల నుంచి విమర్శలు, బెదిరింపులు ఎదుర్కొంటున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తీవ్రంగా స్పందించారు. కాగా, కత్తి మహేష్‌పై పవన్ అభిమాని అయిన సినీ నటి పూనం కౌర్ కూడా కత్తిపై విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో పూనం కౌర్‌కు మహేష్‌ కత్తి కౌంటర్‌ ఇచ్చారు. తనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ పూనంపై అదే స్థాయిలో ఆరోపణలు చేశారు. పవన్‌ ప్రాపకంతో ఏపీలో చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి సంపాదించి ఆయన మెప్పు కోసం తనపై ప్రేలాపనలు చేస్తున్నావని మండిపడ్డారు.

పవన్ రికమండేషన్‌తో..

పవన్ రికమండేషన్‌తో..

పూనంపై కత్తి స్పందన ఇలావుంది...‘పవన్ కళ్యాణ్ రికమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను "ఫ్యాట్సు" అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. కానీ అది నా సంస్కారం కాదు' అని వ్యాఖ్యానించారు.

నువ్వు, పవన్ తల ఎక్కడపెట్టుకుంటారో..

నువ్వు, పవన్ తల ఎక్కడపెట్టుకుంటారో..

అంతేగాక, ‘అడుక్కుని సంపాదించుకున్న పదవి మీద బ్రతుకుతున్న నువ్వా(పూనం కౌర్) నాకు భిక్ష వేసేది? మాటలు జాగ్రత్తగా రాని. నేను నోరు తెరిస్తే నువ్వు, నీ పవన్ కళ్యాణ్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి' అంటూ కత్తి మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నాలుగో భార్య అవ్వ‌డానికి రెడీ అని హీరోయిన్‌ పూనం కౌర్ అన్నారు. ఆమె రెండు మూడు ఇంట‌ర్వ్యూల్లో ఈ విష‌యాన్ని తెలిపింది. కావాలంటే యూ ట్యూబ్‌లో ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌ను చూసుకోండి’ అని క‌త్తి మ‌హేశ్ అన్నారు.

కత్తిపై పూనం పరోక్ష వ్యాఖ్యలు ఇలా..

కత్తిపై పూనం పరోక్ష వ్యాఖ్యలు ఇలా..

వపన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్న కత్తి మహేష్‌పై పవన్ వీరాభిమాని అయిన పూనం కౌర్ పరోక్ష విమర్శలు చేశారు. ఇటీవ‌లికాలంలో ప‌వ‌న్‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్ర స్థాయిలోవిరుచుకుప‌డుతున్నారంటూ వారిని ఉద్దేశించి పూన‌మ్ ప‌రోక్షంగా ఘాటు ట్వీట్లు చేశారు.

విమర్శలు చేసేకంటే అడుక్కుంటే మంచిదంటూ..

విమర్శలు చేసేకంటే అడుక్కుంటే మంచిదంటూ..

‘ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్త‌ములు. ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ స‌మ‌స్య‌. ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి అత‌నికి డ‌బ్బులు డొనేట్ చేయండి. మ‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మ‌నం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విష‌యం. అత‌నికి మంచి పని దొర‌కాల‌ని కోరుకుంటున్నాను' అంటూ పరోక్షంగా కత్తి మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని పూనం కౌర్ ఘాటుగానే విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+