Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇది వాళ్ళ కుట్ర.. ఈడీ చార్జిషీట్ పై మాణిక్కం ఠాగూర్ ప్రశ్నకు కవిత జవాబు!!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమీర్ మహేంద్రు పై వేసిన చార్జిషీట్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ, కెసిఆర్ కుమార్తె కవిత పేరు ఉండటంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈడి వేసిన చార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు ఇరవై ఎనిమిది సార్లు ప్రస్తావించడంతో పాటు, కవిత సమీర్ మహేంద్రు తో కలిసి వ్యాపార భాగస్వామ్యం నిర్వహిస్తున్నారని ఈడీ అభియోగం మోపడంతో కవిత ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తరుణ్ చుగ్ వంటి వారు కవితను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దీనిపై కేసీఆర్ మౌనం వీడి మాట్లాడాలన్నారు.

ఇప్పటికే బీజేపీ నేతలు వరుసగా కవితలు టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ ఉంటే తాజాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కవిత ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమ చార్జ్ షీట్ లో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పేరు ఆమ్ ఆద్మీ పార్టీకి వందకోట్లు చెల్లించిన చార్జిషీట్లో పేర్కొందని ప్రాక్సీ ద్వారా ఒక సంస్థలో 65 శాతం వాటాను కలిగి ఉందని ఓ వ్యక్తి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన ఆయన, కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. కవితపై ఈ కేసులో చాలా ఆరోపణలు వస్తున్నాయన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

 Kavitha answer to Manickam Tagores question on the ED charge sheet in delhi liquor scam

ఇక మాణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్ కు సమాధానంగా ఎమ్మెల్సీ కవిత తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా బూటకమని అవాస్తవమని పేర్కొన్నారు. తన చిత్తశుద్ధిని కాలమే నిరూపిస్తుంది అని ఎమ్మెల్సీ కవిత మాణిక్కం ఠాగూర్ కు సమాధానమిచ్చారు.

అంతేకాదు తమ రైతు వ్యతిరేక విధానాలను, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్య అంటూ పేర్కొన్నారు. ఈడీ చార్జిషీట్ లో తన పేరు ఉండటం బీజేపీ కుట్ర అంటూ కవిత వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+