చివరి నిమిషంలో బీఆర్ఎస్‌కు కొత్త ఆయుధం: కాంగ్రెస్.. రైతు వ్యతిరేకి నినాదం: కవిత

నిజామాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గడువు సమీపించింది. పోలింగ్‌కు మూడు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకొక్క రోజే గడువు. 28వ తేదీ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. ఈ చివరి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.

ఈ పరిస్థితుల్లో అధికార భారత్ రాష్ట్ర సమితికి బిగ్ షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇదివరకు రైతుబంధు (Rythu Bandhu) అమలుకు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు (T Harish Rao) బహిరంగంగా దీనిపై చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలే కారణమని తేల్చింది.

Kavitha reacts on the EC has withdrawn permission for the of Rythu Bandhu

దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఆమె ఉమ్మడి నిజామాబాద్‌లో పర్యటిస్తోన్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం నిజామాబాద్‌లోని శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని అమలు చేస్తూ ఇదివరకు జారీ చేసిన అనుమతులను కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఉపసంహరించుకున్నారనే విషయాన్ని విలేకరులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె మాట్లాడారు.

రైతుబంధు పథకాన్ని ఈసీ నిలిపివేయడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు. ఇది ఇప్పుడు కొత్తగా ప్రకటించినది కాదని, 10 సంవత్సాలుగా కొనసాగుతూ వస్తోందని గుర్తు చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కొత్తగా ప్రకటించిన పథకం కాదని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.

Kavitha reacts on the EC has withdrawn permission for the of Rythu Bandhu

కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటపడి..దీన్ని నిలిపివేయించారని కవిత ఆరోపించారు. 10 సంవత్సరాల్లో 72 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని 65 లక్షలమంది రైతులకు బదిలీ చేశామని గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ బీఆర్ఎస్, కేసీఆర్ వైపు ఉన్నారనే భయం కాంగ్రెస్ నేతల్లో నెలకొని ఉందని, ఒక అభద్రత భావంతో నిలిపివేయించారని విమర్శించారు.

కాంగ్రెస్ నాయకులు రైతు వ్యతిరేకులు అనే విషయం మరోసారి రుజువైందని కవిత ధ్వజమెత్తారు. రైతుల నోటివద్ద కూడు లాక్కునే ప్రయత్నానికి కాంగ్రెస్ నాయకులు పాల్పడ్డారని మండిపడ్డారు. రైతు బంధు, రైతు రుణమాఫీని సైతం వారు అడ్డుకున్నారంటూ ఆరోపించారు. తాము రైతాంగానికి వ్యతిరేకమని విషయాన్ని వారు మళ్లీ నిరూపించుకున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+