రేవంత్ రెడ్డి బలుపెక్కి మాట్లాడుతున్నావ్; చెప్పు దెబ్బలు తింటావా: కవిత ఆగ్రహం

తనపై, తన తండ్రిపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తావా ? రేవంత్ రెడ్డి బలుపెక్కి మాట్లాడుతున్నాడు అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై, ఎంపీ కవిత పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో తనకు భూములు ఉన్నట్టు రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే పది చెప్పులు దెబ్బలు తింటావా అంటూ రెడ్యా నాయక్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక ఇదే విషయంలో రెడ్యానాయక్ కుమార్తె ఎంపీ కవిత కూడా రేవంత్ పై మరోమారు నిప్పులు చెరిగారు.

రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్

రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్

రేవంత్ రెడ్డికి పిచ్చెక్కి, బలుపెక్కి మాట్లాడుతున్నాడని ఎంపీ మాలోతు కవిత వ్యాఖ్యలు చేశారు. తనపై తన తండ్రి పై వచ్చిన ఆరోపణల పై స్పందించిన ఆమె మహబూబాబాద్ లో విమర్శలు చేయడానికి తాను, తన తండ్రి తప్ప రేవంత్ రెడ్డికి ఎవరు కనిపించడం లేదంటూ మండిపడ్డారు. తన తండ్రి రెడ్యానాయక్ నిజాయితీగా రాజకీయాలు చేశారని, అందుకే జనరల్ స్థానంలో ఏడుసార్లు గెలిచారని ఆమె పేర్కొన్నారు.

రేవంత్ చెప్పు దెబ్బలకు నువ్వు రెడీనా .. కవిత ప్రశ్న

రేవంత్ చెప్పు దెబ్బలకు నువ్వు రెడీనా .. కవిత ప్రశ్న

హైదరాబాద్లో తనకు భూమి ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరోమారు సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి చెప్పు దెబ్బలు తింటాడా అంటూ ఎంపీ కవిత ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు చేయడం మా కుటుంబంలోనే లేదని పేర్కొన్న ఆమె, తాము అవినీతిపరులమైతే ప్రజలు ఇన్నిసార్లు ఓట్లు వేసి గెలిపించరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే హరిప్రియతో విబేధాలు లేవన్న కవిత

ఎమ్మెల్యే హరిప్రియతో విబేధాలు లేవన్న కవిత

2009 ఎన్నికలలో ఎమ్మెల్యే సీటు కోసం చూశానని, కానీ కెసిఆర్ ఎంపీగా బరిలోకి దిగాలని సూచిస్తే ఎంపీ గానే పోటీ చేశానని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు కూడా కెసిఆర్ ఆదేశాల మేరకే నడుచుకుంటానన్నారు. ఎమ్మెల్యే హరిప్రియతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తానని ఎంపీ కవిత స్పష్టం చేశారు. కెసిఆర్ చెప్పిన విధంగా పార్లమెంట్ లో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు ఎంపీ కవిత. మొత్తంగా తనపై, తన తండ్రిపై వస్తున్న ఆరోపణలకు ఎంపీ కవిత రేవంత్ రెడ్డికి ఘాటుగా బదులిచ్చారు.

రేవంత్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు

రేవంత్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు

రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్యా నాయక్ పార్టీ మారడం వెనుక షాకింగ్ ఆరోపణలు చేశారు. మియాపూర్ లో 5 ఎకరాల భూమి కోసమే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కూతురు కవిత ఒత్తిడికి తలొగ్గి రెడ్యా నాయక్ పార్టీ మారారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన రెడ్యా నాయక్, ఎంపీ కవితలు రేవంత్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+