పవన్ మనకు వ్యతిరేకమే- అయినా జై ఆంధ్ర..! కవిత సంచలనం..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కోనసీమ జిల్లాకు వెళ్లిన సందర్భంగా వాలిపోయిన అక్కడి కొబ్బరి చెట్లను పరిశీలించి దానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలతో పాటు ఏపీలోని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. అలాగే తెలంగాణ మంత్రులు పవన్ సినిమాల్ని అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కవిత ఇవాళ స్పందించారు. ఓపక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకూ మనకు వ్యతిరేకమే అన్నారు. ఇవాళ కూడా తెలంగాణ నాయకుల దిష్టి వల్లే కోనసీమ పాడైందని అంటున్నారన్నారు. తాము ఎప్పుడు దిష్టి పెట్టలేదన్నారు. కోనసీమ బాగుంది, అలాగే తెలంగాణ కావాలని తాముకోరుకున్నామన్నారు.

Kavitha vs Pawan Kalyan You Oppose Telangana We Call Jai Andhra

ఏనాడు తెలంగాణ బిడ్డలకు మనసు చిన్నగా ఉండదని, పెద్దగా ఉంటుందని, పెద్దగా ఆలోచిస్తామని కవిత గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ కాలంలో తాము ఎప్పుడూ జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నామని తెలిపారు. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్రా కూడా బాగుండాలన్నారు. తాను స్వయంగా లోక్ సభలో నిలబడి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు గుర్తుచేసుకున్నారు. తెలంగాణ వాళ్లం ఎప్పుడూ పక్కోళ్లను గుంజుకోవాలని చూడమన్నారు.

Kavitha vs Pawan Kalyan You Oppose Telangana We Call Jai Andhra

పక్కోడు బాగుంటే తమ కళ్లు మండవని కవిత తెలిపారు. తాము బాగుండాలని కోరుకుంటామని, పక్కోడు చెడిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తమ ఉద్యమంలో అలా కోరుకున్నట్లయితే దాని స్వరూపం వేరేలా ఉండేదన్నారు. తమ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్ప పరాయి రాష్ట్రం వారిపై చేయి ఎత్తలేదన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో పవన్ సినిమా యాక్టర్ మాత్రమేనని, కానీ పవన్ ఇప్పుడు ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం అని, కాబట్టి మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలని కవిత సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+