Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ సినిమాకు థియేటర్లు కరువా! యూట్యూబ్‌లో ఉద్యమ సింహం విడుదల!

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమసారథి... గులాబీ దళపతి కేసీఆర్. ఆయన నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం ఉద్యమ సింహం. కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పోరాడిన తీరు, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు పడుతున్న శ్రమను కథాంశంగా ఈ చిత్రం నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి.

కేసీఆర్ సినిమాకు థియేటర్లు కరువు

కేసీఆర్ సినిమాకు థియేటర్లు కరువు

ఉద్యమసింహం చిత్రాన్ని మార్చి 29న రిలీజ్ చేయాలని భావించారు. అయితే కొందరు సినిమా విడుదల అవకుండా సమస్యలు సృష్టించారు. డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల ఓనర్లను బెదిరించారు. దీంతో కేసీఆర్ బయోపిక్ ఉద్యమ సింహం విడుదలకు థియేటర్లు కరువయ్యాయి.

Recommended Video

    Udyama Simham Movie Press Meet || Filmibeat Telugu
    యూట్యూబ్‌లో రిలీజ్

    యూట్యూబ్‌లో రిలీజ్

    కేసీఆర్ బయోపిక్ విడుదలకు థియేటర్లు లేకపోవడంతో నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వరరావ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాను యూట్యూబ్‍‌లో రిలీజ్ చేశారు. టీవీ ఛానెళ్లలోనూ ఫ్రీగా ప్రసారం చేసుకోవచ్చని ప్రకటించారు. యూట్యూబ్ నిర్వాహకులు ఉద్యమ సింహం చిత్రాన్ని తమ ఛానళ్లలో అప్ లోడ్ చేసుకోవచ్చని, ఎలాంటి కాపీరైట్ సమస్యలు తలెత్తవని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

    తలసాని ఏం చేయలేకపోయారా?

    తలసాని ఏం చేయలేకపోయారా?

    తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా తమ పార్టీ అధినేత చిత్రం విడుదలకు థియేటర్లు దొరకకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం ఈ విషయంలో ఏం చేయాలేకపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ సింహం విడుదలను అడ్డుకున్న లాబీని ఎదుర్కోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+