వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గేదేలే.. కేసీఆర్ కూతురు కవిత, వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల.. ఇద్దరిదీ ఒకే పంధా!!

|
Google Oneindia TeluguNews

వారిద్దరూ ప్రభావవంతమైన కుటుంబాలనుంచి వచ్చిన రాజకీయ నాయకులు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, లక్షణాలను పుణికిపుచ్చుకున్న మహిళా మణులు. కానీ ఇద్దరు మహిళలది ఒకటే పంధా. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు మహిళలు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కెసిఆర్ బిడ్డ కవిత, వైయస్సార్ బిడ్డ షర్మిల అని టక్కున చెప్పేస్తారు.

బతుకమ్మ పేరుతో డిస్కోడ్యాన్సులు చేసిన పాపం ఊరికే పోదు: కవితపై బండి సంజయ్ తీవ్రవ్యాఖ్యలుబతుకమ్మ పేరుతో డిస్కోడ్యాన్సులు చేసిన పాపం ఊరికే పోదు: కవితపై బండి సంజయ్ తీవ్రవ్యాఖ్యలు

కవిత, వైఎస్ షర్మిల .. పోరాటంలో వారిది ఒకే పంధా

కవిత, వైఎస్ షర్మిల .. పోరాటంలో వారిది ఒకే పంధా


తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కెసిఆర్ బిడ్డ కవిత, వైయస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల చుట్టే తిరుగుతున్నాయి. కేంద్రంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని కేసీఆర్ బిడ్డ కవిత చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం లో తాను వెనకడుగు వేయనని వైయస్ షర్మిల తేల్చి చెబుతున్నారు. పోరాట పంథాలో ఇద్దరిదీ ఇప్పుడు ఒకేదారిగా కనిపిస్తుంది. తమ పోరాటానికి ఎవరి సహకారం అవసరం లేదని ముందుకు వెళ్తున్న పరిస్థితి వారిద్దరి లోనూ కనిపిస్తుంది.

 తెలంగాణా ప్రభుత్వంపై పాదయాత్ర అనుమతి కోసం పోరాటం చేస్తున్న కవిత

తెలంగాణా ప్రభుత్వంపై పాదయాత్ర అనుమతి కోసం పోరాటం చేస్తున్న కవిత


తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, స్థానిక నాయకుల పనితీరుపై విరుచుకుపడుతున్న షర్మిలను అణగదొక్కే ప్రయత్నం టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. పాదయాత్ర కు అనుమతి నిరాకరించి, ఎక్కడికక్కడ వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలపై కేసులు పెట్టి నిర్బంధకాండ కొనసాగిస్తుంది. ఈ క్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన వైయస్ షర్మిల తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదని తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

 టీఆర్ఎస్ నాయకుల మూకుమ్మడి దాడి.. తగ్గేదే లేదన్న వైఎస్ షర్మిల

టీఆర్ఎస్ నాయకుల మూకుమ్మడి దాడి.. తగ్గేదే లేదన్న వైఎస్ షర్మిల


వైయస్ షర్మిల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రధాని నరేంద్ర మోడీ వరకు చేరి, ఆయన నేరుగా వైయస్ షర్మిల కు ఫోన్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాష్ట్రంలోనూ షర్మిల పై టీఆర్ఎస్ నాయకులు మూకుమ్మడి దాడి చేస్తున్నా ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక వైయస్ షర్మిల తనను ఎంత తొక్కేసే ప్రయత్నం చేసినా.. తగ్గేది లేదని, తన పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. కెసిఆర్ పై తాను చేసే పోరాటంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు.

 కవితపైనా ప్రతిపక్షాల మాటల దాడి.. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ.. భయపడనన్న కవిత

కవితపైనా ప్రతిపక్షాల మాటల దాడి.. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ.. భయపడనన్న కవిత


ఇక వైయస్ షర్మిల తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు నోటీసులిచ్చి విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు, ఎన్ని దాడులు చేసినా తాను వెనుకడుగు వేసేది లేదని తేల్చిచెప్పారు. ఇక ప్రతిపక్షాలు ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో కవితను ఎంత టార్గెట్ చేసినా ఆమె తన పోరాటం కొనసాగిస్తున్నారు. తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దాడులు చేసినా వెనక్కి తగ్గమని మరో మారు స్పష్టం చేసిన కవిత తెలంగాణ ఆడబిడ్డల కళ్ళలో నుండి నీళ్ళు రావు నిప్పులు వస్తాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న తమను, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుందని చెబుతున్న కవిత, అణచివేతకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

షర్మిల విషయంలో జగన్ సైలెంట్.. కవిత విషయంలో కేటీఆర్ కూడా సైలెంట్

షర్మిల విషయంలో జగన్ సైలెంట్.. కవిత విషయంలో కేటీఆర్ కూడా సైలెంట్

ఇక వీరిద్దరి విషయంలో చెప్పుకోవాల్సిన మరో అంశం. వైయస్ షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే కాకుండా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి కూడా. అయినప్పటికీ వైయస్ షర్మిల రాజకీయం విషయంలో నేటి వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక ఇదే ధోరణిలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుమార్తె, మంత్రి కేటీఆర్ సోదరి. కవిత విషయంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పై జరుగుతున్న విచారణ విషయంలో తండ్రి కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ స్పందించిన దాఖలాలు లేవు. అయితే కవిత తాను తీసుకునే నిర్ణయాలు తండ్రి కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత తీసుకున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇద్దరూ తమ తమ సమస్యల కోసం ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. అందుకే కవిత, వైయస్ షర్మిల ఇద్దరి పంథా సేమ్ టు సేమ్ అని చెప్పక తప్పదు.

English summary
It can be said that KCR's daughter Kavitha and YSR's daughter YS Sharmila are the same in the fight. Kavitha against the Center and YS Sharmila against the state government are continuing their fight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X