రాసి పెట్టుకోండి, నెక్స్ట్ జరిగేది ఇదే - కేసీఆర్ సంచలనం..!!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయితీ ఎన్నికల వేళ కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన పైన స్పందించారు. ఆశలు పెట్టుకోని ఆగం కావద్దని సూచించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పిన కేసీఆర్.. కష్టాలు వచ్చిన సమయంలో వెరవకూడదని సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని.. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ధీమా వ్యక్తం చేసారు.
మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కేసీఆర్ దత్తత తీసుకున్న, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు కేసీఆర్ ను కలిశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనిచచ. కష్టాలు వచ్చిన సమయంలో వెరవకూడదని చెప్పిన కేసీఆర్... మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

పల్లెల్లో తిరిగి మంచి రోజులు తప్పకుండా వస్తాయని చెప్పుకొచ్చారు. అప్పటివరకు అధైర్యపడొద్దని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తి, స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని భరోసా ఇచ్చారు. గంగదేవిపల్లి మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని, గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావొద్దని సూచించారు.మోడల్ విలేజ్ గంగాదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాము అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయన్నారు.

కాగా, అటు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పైన వచ్చే వారం స్పీకర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు దిశగా గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఖైరతాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరు పైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications