ఇక వారి పని పడదాం, వదిలేది లేదు - కేసీఆర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన ఎమ్మెల్యేల భవితవ్యం ఆధార పడి ఉంది. అటు కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానికి చేరటంతో తదుపరి చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కీలక అంశాల పైన చర్చిస్తున్నారు. తాజాగా కాళేశ్వరం కమీషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నెల 4న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ నివేదిక పైన చర్చ.. తదుపరి చర్యల పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక, బీసీ రిజర్వేషన్ల పైన కేసీఆర్ కార్యాచరణ ఖరారు చేసారు. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్సీలపై కేసీఆర్ ఫోకస్ చేసారు. వారిపై కూడా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, అనంతర పర్యవసానాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రతి వెలువడిన తర్వాత న్యాయవాదులతో క్షుణ్నంగా అధ్యయనం చేయించాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. దీంతో స్పీకర్ నిర్ణయం తీసుకోకతప్పదని ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి గట్టిగా పోరాడిందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్సీలపైనా సుప్రీంకోర్టులో కేసు వేద్దామని నిర్ణయించినట్లు సమాచారం. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని, అవసరమైతే దీనిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామని కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా భారత రాష్ట్ర సమితి జయభేరి మోగిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications