Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేబినెట్లోకి గుత్తా- ఛైర్మన్ గా మధుసూధనాచారి: కౌశిక్ రెడ్డికి మరో ఛాన్స్-కేసీఆర్ నయా లెక్కల వెనుక..!!

హుజూరాబాద్ ఫలితం తరువాత తెలంగాణ అధికార పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉప ఎన్నికల్లో సామాజిక సమీకరణాల ప్రభావం గమనించిన తరువాత...ముఖ్యమంత్రి కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా కొత్త నియామకాల విషయంలో పక్కా సమీకరణాలు పాటిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ శాసన మండలిలో ఆరుగురు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సి ఉంది. దీని పైన కసరత్తు తుది దశకు చేరుకుంది. అదే సమయంలో మండలి ఛైర్మన్ గా బీసీ వర్గానికి ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఛైర్మన్ గా మధుసూధనాచారి ఖాయంగా

ఛైర్మన్ గా మధుసూధనాచారి ఖాయంగా

అందులో భాగంగా..సీనియర్ నేత..అసెంబ్లీ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారికి ఒక బెర్త్‌ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్‌ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యా బలంతో మొత్తం ఆరు స్థానాలు గులాబీ పార్టీకే దక్కనున్నాయి. శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి జూన్‌లో విరమణ చేసినప్పటి నుంచి మండలి పూర్తి స్థాయి చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది.

కేబినెట్ లో గుత్తాకు ఛాన్స్

కేబినెట్ లో గుత్తాకు ఛాన్స్

ప్రస్తుతం వి.భూపాల్‌రెడ్డి ప్రొటెం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసి, మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి నల్లగొండ ఎంపీగా ఎన్నికైన గుత్తా, మంత్రి పదవి హామీతోనే టీఆర్‌ఎ్‌సలో చేరారు. అప్పుడు కుదరకపోవడంతో కేబినెట్‌ హోదాతో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మండలి చైర్మన్‌ చేశారు. కాగా, మేలో ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌ అయ్యాక మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. తాజా పరిణామాలతో గుత్తాను ఎమ్మెల్సీ చేసి..దానిని భర్తీ చేస్తారని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు విశ్వసిస్తున్నారు. వీరిద్దరి స్థానాలు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది.

కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో

కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో

మిగిలిన 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి హుజూరాబాద్‌ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డి, మరొకటి సీనియర్‌ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు ఖాయమైనట్లు తెలుస్తోంది. కౌశిక్‌ను ఇప్పటికే గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మంత్రివర్గం సిఫారసు చేసింది. అయితే, గవర్నర్‌ ఆమోదం లభించకపోవడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, గుత్తాను గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఉద్యమంలో పార్టీ విద్యార్థి నేతగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివా్‌సకు ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.

ఎర్రోళ్లకు దళిత బంధు బాధ్యతలు

ఎర్రోళ్లకు దళిత బంధు బాధ్యతలు

దళిత బంధు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి ఎర్రోళ్ల పేరు పరిశీలనలో ఉన్నట్లూ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎస్సీ వర్గం నుంచి ఎమ్మెల్సీగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఉప ఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్‌ బహిరంగంగానే హామీ ఇవ్వడంతో, మరో ఎమ్మెల్సీ స్థానానికి నాగార్జున సాగర్‌ నియోజకవర్గ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలతో కుదరకపోతే, బీసీ వర్గానికి పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు.

Recommended Video

    కేసీఆర్ ఫాం హౌస్ వదిలిపెట్టాలన్న వీహెచ్ || Oneindia Telugu
    ఆశావాహులకు బుజ్జగింపులు

    ఆశావాహులకు బుజ్జగింపులు

    అప్పుడు ఎల్‌.రమణ లేదా కర్నాటి విద్యాసాగర్‌ (పద్మశాలీ) పేర్లు పరిశీలనలోకి వస్తాయని భావిస్తున్నారు. ముదిరాజ్‌ వర్గానికి ఇవ్వాలనుకుంటే పిట్టల రవీందర్‌ పేరును పరిగణించవచ్చని భావిస్తున్నారు. ఇక, ఆశావాహులు పలువురు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 4న స్థానిక సంస్థల కోటాలో ఒకేసారి 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి డిసెంబరులోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు అవకాశం రానివారిని స్థానిక సంస్థల కోటాలో సర్దుబాటు చేస్తామంటూ అధిష్ఠానం ఇప్పటికే ఆశావహుల్లో కొందరిని బుజ్జగించే యత్నాలు మొదలు పెట్టింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+