వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నష్టం తప్పదు, కిరణ్ రెడ్డి అహంకారం.. అదీ మన పరిస్థితి: కేసీఆర్, పనికి రానివి.. బిల్లుకు ఒకే

భూములు పోకుండా ప్రాజెక్టులు కట్టలేమని, బహుళార్దక ప్రాజెక్టులు కట్టినప్పుడు కొంత నష్టం తప్పదని, అతి తక్కువ నష్టంతో ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నాలు చేయాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భూములు పోకుండా ప్రాజెక్టులు కట్టలేమని, బహుళార్దక ప్రాజెక్టులు కట్టినప్పుడు కొంత నష్టం తప్పదని, అతి తక్కువ నష్టంతో ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

కోమటిరెడ్డీ! నీ రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకుంటున్నావ్: కేసీఆర్, వైయస్ పైన..కోమటిరెడ్డీ! నీ రాజకీయ భవిష్యత్తు పోగొట్టుకుంటున్నావ్: కేసీఆర్, వైయస్ పైన..

ఆయన తెలంగాణ అసెంబ్లీలో భూసేకరణ బిల్లు పైన చర్చ సందర్భంగా మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని అంటున్నారని, కానీ ఆ చట్టంలో వజ్రాలు లేవని ఎద్దేవా చేశారు. రైతులకు పరిహారం తక్కువైతే ఎవరిది బాధ్యత అన్నారు.

2013 చట్టంలో ఉన్న దాని కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని కోర్టుకు చెప్పామన్నారు. 2013 భూసేకరణ చట్టం బాధ్యతారహితంగా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టానికి తాడు బొంగరం లేదన్నారు. ప్రజలను కష్టపెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.

kcr

తెలంగాణ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. అన్ని పక్షాల వాదనలను ప్రజలు వింటున్నారన్నారు. ప్రాజెక్టులు కట్టినప్పుడు పాక్షికంగా నష్టం జరుగుతుందన్నారు. భూములు ఉన్న వారు అవి పండకపోయినా ఇచ్చేందుకు ఇష్టపడరన్నారు.

నేను మాదిగ కులంలో పుట్టలేదు కానీ, కేసీఆర్‌కు థ్యాంక్స్: రేవంత్ రెడ్డినేను మాదిగ కులంలో పుట్టలేదు కానీ, కేసీఆర్‌కు థ్యాంక్స్: రేవంత్ రెడ్డి

చైనాలోను ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చారన్నారు. మల్లన్న సాగర్‌కు 70 శాతం మంది రైతులు స్వచ్చంధంగా భూములిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టుల పైన రచ్చ చేస్తూ, స్టే తెస్తూ రాక్షసానందం పొందుతున్నారన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టాయన్నారు.

కిరణ్ రెడ్డి అహంకారం.. అదీ మన పరిస్థితి

సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణపై దాడి జరిగిందన్నారు.

సాక్షాత్తు నిండు అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. ఈటెల రాజేందర్ ముఖం పట్టుకొని మీకు ఒక్క రూపాయి ఇవ్వమని హెచ్చరించారన్నారు. కిరణ్ రెడ్డి అహంకారంగా మాట్లాడారన్నారు. అప్పుడు మన పరిస్థితి అది అన్నారు. సమైక్య పాలకులతో మనం ఇబ్బంది పడ్డామన్నారు.

మల్లన్న సాగర్ తన ఇంటి కోసం కట్టుకున్నట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ సాగర్ నీళ్లు నేనొక్కడినే తాగుతానా అన్నారు. వాస్తవానికి మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఏడు లక్షల నష్టపరిహారం ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.

సెక్యూరిటీ గార్డ్ కూడా ఆంధ్రోళ్లే ఐతే ఎలా?: ఆంధ్రా యాసలో అడిగిన టి ఎమ్మెల్యేసెక్యూరిటీ గార్డ్ కూడా ఆంధ్రోళ్లే ఐతే ఎలా?: ఆంధ్రా యాసలో అడిగిన టి ఎమ్మెల్యే

రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు విపక్షాలు చేస్తున్నాయన్నారు. ఏపీ చరిత్రలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వని పరిహారం ఇచ్చామన్నారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు జీవో 123 తీసుకు వచ్చామన్నారు. విపక్షాల తీరుతో రైతులు నష్టపోతున్నారన్నారు.

గోదావరి జిల్లాలకు తీసిపోని విధంగా..

గోదావరి నదిలో మనం 30 శాతం నీళ్లు కూడా వాడటం లేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రెండు పంటలు పండించి చూపిస్తామన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చి దిద్దుతామన్నారు.

దేశంలో కంటే తెలంగాణలోనే ఎక్కువ పరిహారం ఇస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడినంత మాత్రాన ఆగదన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ చేయకుండా సాధ్యమేనా అని ప్రశ్నించారు.

కష్టపడి తెలంగాణను సాధించుకున్నామని, అబివృద్ధికి, ప్రాజెక్టులు కట్టేందుకు విపక్షాలు సహకరించాలని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడినంత మాత్రాన ప్రాజెక్టులు ఆపే సమస్య లేదన్నారు.

చట్టాన్ని అధిగమిస్తే ఎవరినైనా ప్రశ్నించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ఏ సమస్యా లేనట్లు విపక్షాలు అన్నీ మల్లన్న సాగర్ పైన పడ్డాయన్నారు. ప్రాజెక్టులు కట్టకుండా ముఠా ఏర్పడి రాక్షసానందం పొందుతోందన్నారు.

రైతుల మధ్య అసాంఘిక శక్తులు..

మల్లన్న సాగర్ వద్ద కాల్పుల ఘటన పైన కేసీఆర్ స్పందించారు. నిరసన సమయంలో రైతుల మధ్యలో కొందరు అసాంఘీక శక్తులు ఉన్నారని చెప్పారు. కొందరు అసాంఘిక శక్తులు కాల్పులు జరిగేలా పోలీసులను రెచ్చగొట్టాయన్నారు.

చట్టంలో కొన్ని తొలగింపులపై ప్రశ్నించగా..

చట్టంలో కొన్నింటిని తొలగించడంపై కాంగ్రెస్ సభ్యులు జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దానిపై కేసీఆర్ మాట్లాడుతూ.. పనికి రానివి తొలగించామన్నారు. ఇతర రాష్ట్రాల్లోను అలాగే తొలగించారని, అందరూ పనికి రానివాళ్లేనా అని నిలదీశారు. దానికి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మీకు సంఖ్యా బలం ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడగలరని విమర్శించారు. సిపిఎం పార్టీకి దిక్కుమాలిన స్ట్రాటజీలు ఉంటాయన్నారు.

బిల్లుకు ఆమోదం

తెలంగాణ భూసేకరణ బిల్లుకు తెలంగాణ శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ వాయిదా పడింది.

English summary
KCR on Mallanna Sagar project in Telangana Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X