వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక నుండి ఆత్మీయ సమ్మేళనాలతో ఆదరగొట్టుడే... కేసీఆర్ మాస్టర్ ప్లాన్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారా? వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం కోసం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారా? ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పిన కేసీఆర్ వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న కేసీఆర్

టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరోమారు పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన జోష్ తో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ముందస్తుకు వెళ్ళే ఆలోచనలో ఉందని ఊహాగానాలు వచ్చాయి. దానికి తగ్గ్గట్టుగా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అయితే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని అందరూ భావిస్తే, అందుకు భిన్నంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఎన్నికలకు ఇప్పటి నుండే రంగంలోకి దిగాలన్న కేసీఆర్

ఎన్నికలకు ఇప్పటి నుండే రంగంలోకి దిగాలన్న కేసీఆర్

ఇక ఇదే సమయంలో నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరును మెరుగు పరుచుకోవాలి అని సూచించారు. ప్రజాక్షేత్రంలో వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడానికి ఇప్పటినుంచే పనిచేయాలని చెప్పిన కేసీఆర్, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఇక మునుగోడులో గెలిచినా మెజార్టీ తగ్గటాన్ని కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. అందుకే అందరూ ఇప్పటినుండే కార్యాచరణలోకి దిగాలని కేసీఆర్ సూచించినట్టు సమాచారం.

 ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్ళాలన్న కేసీఆర్

ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోకి వెళ్ళాలన్న కేసీఆర్


అంతేకాదు వచ్చే ఎన్నికల ప్లాన్ లో భాగంగా ఇప్పటి నుంచే పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీవిస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుస్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులు పాల్గొనాలని, నియోజకవర్గ అభివృద్ధి నివేదిక రూపొందించుకోవాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి వచ్చే ఎన్నికల కోసం పని చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీని బలోపేతం చేయడం కోసం పదేళ్లపాటు కష్టపడాలని చెప్పారు. మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా అంతటా తిరగాలని సూచించారు. మూడోసారి కూడా విజయం సాధించడం కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని కెసిఆర్ దిశానిర్దేశం చేశారు.

English summary
Chief Minister Chandrasekhar Rao said in the general meeting of the TRS party that the party leaders should organize spiritual gatherings from now on for the upcoming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X