కెసిఆర్ గురి కుదిరింది: తనను లక్ష్యంగా చేసుకున్న వారికి స్పాట్ : ఆపరేషన్ సక్సెస్..!
తెలంగాణ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌లు. కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి నేతల్లో కొందరు నేతలను కెసిఆర్ టార్గెట్ చేసారు. తనను వ్యక్తిగతంగా విమర్శించేవారు..తన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తన్న వారిని కెసిఆర్ ఎలాగైనా సభలో కాలు పెట్టనీయకూడదని డిసైడ్ అయ్యారు. తొలుత స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించుకున్న వారిని తమ నియోజకవర్గాలకే పరిమతం చేసే వ్యూహాలను అమలు చేసి..వారిని ఎలాగైనా ఓడించాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నది సాధించారు.
టిఆర్‌యస్ అధినేత కెసిఆర్ చేపట్టిన అపరేఫన్ సక్సెస్ అయింది. ఎలాగైనా కాంగ్రెస్ సీనియర్లకు..ప్రత్యేకించి తనను పదేపదే విమర్శించే వారిని ఓడించటం ద్వారా..కాంగ్రెస్ మూలాలనే తెలంగాణలో దెబ్బ తీయాలని కెసిఆర్ వ్యూహం అమలు చేసారు. పకడ్బందీగా అమలు చేసిన ఈ వ్యూహంతో తెలంగాణలో టిఆర్‌యస్ గెలవటం ఒక ఎత్తు అయితే.. ఊహించని విధంగా సీనియర్లు ఓడిపోవటం అనటం కంటే ఓడించటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వ్యూహంలో భాగంగా.. ముఖ్యంగా టీఆర్‌ఎస్ అంటేనే ఒంటికాలితో లేచే నేతలను టార్గెట్ చేసింది. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జానారెడ్డి, జీవన్‌రెడ్డి తదితర నేతలను ఓడించేందుకు అత్యంత పటిష్టమైన వ్యూహాలతో వెళ్లింది. మొత్తానికి కాంగ్రెస్ అగ్రనేతలను ఓడించాలన్న గులాబీ అధినేత కేసీఆర్ వ్యూహం పూర్తిగా ఫలించినట్టు కనిపిస్తోంది. జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సిహా, జీవన్‌రెడ్డి వంటి హేమాహేమీలను కెసిఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. అనుకున్న విధంగా..ఈ సీనియర్లు అందరూ ఓటమి పాలయ్యారు.

శాసనసభలో అధికార పార్టీకి కంట్లో నలుసులా వ్యవహరించే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, సంపత్ లను గతంలోనే సభ నుండి అనేక సార్లు సభ నుండి సస్పెండ్ చేసారు. ఇక, డికె అరుణ చేసిన కొన్ని కామెంట్ల పై కెసిఆర్ ఆగ్రహంతో ఉన్నారు. ఇక, జీవన్ రెడ్డి లాంటి వారిని కట్టడి చేయటం ద్వారా..అంశాల వారీగా సభలో గట్టిగా నిలదీసే వ్యక్తులను సభకు రాకుండా..తమకు ఇబ్బంది లేకుండా చేయటంలో కెసిఆర్ సక్సెస్ అయ్యారు. ఇక, ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ చూస్తుంటే ఇక..కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా తప్పదు. అందులో ఇప్పటి వరకు భట్టి విక్రమార్క ప్రస్తుతానికి ఆధిక్యతతో ఉన్నారు. ఆయన గెలిస్తే ఆయనే సీఎల్పీ నేతగా ఉండే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉండటంతో.. భట్టికి ఆ అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, కాంగ్రెస్ సీనియర్లు ఓటమి పాలవటంతో..సభలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటం ఇక టిఆర్‌యస్‌కు సమస్యలు ఉండకపోవచ్చు.

-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications