ఐఫోన్లు ఇక్కడే తయారు చేయండి: కుక్‌తో కెసిఆర్, తొలి సీఎం అని కుక్(పిక్చర్స్)

హైదరాబాద్‌: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ తన కొత్త ఐఫోన్ల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆ సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ను కోరారు. దీనికి ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు.

యాపిల్‌ మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం కోసం సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిని ఇస్తామని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంక్యుబేటర్‌, టీహబ్‌లలో ఆ సంస్థ భాగస్వామి కావాలని కోరారు.

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్ బిల్డింగ్‌లో యాపిల్‌ మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం ఆయనతో మాట్లాడుతూ.. మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కుక్‌తో సీఎం కెసిఆర్

కుక్‌తో సీఎం కెసిఆర్

టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ తన కొత్త ఐఫోన్ల తయారీ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆ సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ను కోరారు. దీనికి ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు.

కుక్‌తో సీఎం కెసిఆర్

కుక్‌తో సీఎం కెసిఆర్

యాపిల్‌ మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం కోసం సొంత ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిని ఇస్తామని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంక్యుబేటర్‌, టీహబ్‌లలో ఆ సంస్థ భాగస్వామి కావాలని కోరారు.

కుక్‌తో సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్

కుక్‌తో సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్ బిల్డింగ్‌లో యాపిల్‌ మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రంను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

సీఎం కెసిఆర్ ఆయనతో మాట్లాడుతూ.. మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రం కోసం తెలంగాణను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

జ్యోతి ప్రజ్వలన

జ్యోతి ప్రజ్వలన

తెలంగాణ పారిశ్రామిక రంగంలో పురోగమిస్తోందని, ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో యాపిల్‌ ఉత్పత్తుల పరిశ్రమను ఏర్పాటు చేయాలని సూచించారు.

కుక్‌తో కెసిఆర్

కుక్‌తో కెసిఆర్

అమెరికా తర్వాత యాపిల్‌ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ఈ రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని, ఇప్పటికే పలు సెల్‌ఫోన్‌ సంస్థలు హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించాయని తెలిపారు.

కుక్‌తో సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్

కుక్‌తో సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్

సెల్‌ఫోన్ల తయారీ సంస్థలకు ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించామని, రాయితీలతో పాటు అనేక ప్రోత్సాహకాలను ఇస్తున్నామన్నారు

కేటీఆర్ ప్రసంగం

కేటీఆర్ ప్రసంగం

యాపిల్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, హైదరాబాద్‌లో పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా దేశీయంగానే గాక ఆసియాలోనూ మార్కెట్‌ ఉంటుందని చెప్పారు.

కుక్ ప్రసంగం

కుక్ ప్రసంగం

ఆ సంస్థ ఉత్పాదక పరిశ్రమతో పాటు తాజాగా ప్రారంభించిన మ్యాప్‌ల అభివృద్ధి కేంద్రానికి కోరిన చోట స్థలం ఇస్తామని, అద్దె భవనం కంటే సొంత భవనం అవసరమని సీఎం తెలిపారు. వాటిలో నీరు, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు.

కెసిఆర్ ప్రసంగం

కెసిఆర్ ప్రసంగం

దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామని, ఇందులో సెల్‌ఫోన్‌, నెట్‌వర్క్‌ అప్లికేషన్‌తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థలకు అవకాశం కల్పిస్తున్నామని, యాపిల్‌ దీనిని వినియోగించుకోవాలన్నారు.

జ్ఞాపిక బహూకరణ

జ్ఞాపిక బహూకరణ

యువతలో సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు దేశంలోనే తొలిసారిగా టీహబ్‌ను ప్రారంభించామని తెలిపారు. దీనిలోనూ భాగస్వామిగా చేరాలని సూచించారు. ఇంక్యుబేటర్‌, టీహబ్‌తో కలిసి యాక్సిలరేటర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, వినూత్న ఆలోచనల అమలుకు సహకరించాలని, అంకుర పరిశ్రమలను స్థాపించేవారిని ప్రోత్సహించాలని కోరారు.

ప్రతులు

ప్రతులు

తెలంగాణ పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్‌ ప్రతులను సీఎం కేసీఆర్‌ టిమ్‌కుక్‌కు అందజేశారు.

సెల్పీ విత్ టిమ్ కుక్

సెల్పీ విత్ టిమ్ కుక్

సీఎం కేసీఆర్‌ ప్రతిపాదనలను టిమ్‌కుక్‌ స్వాగతించారు. వీటిపై సత్వరమే నిర్ణయాలను వెల్లడించలేనని, అన్ని అంశాలను అధ్యయనం చేసి, చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోసారి తాను తెలంగాణకు వస్తానని హామీ ఇచ్చారు.

కుక్‌తో కెసిఆర్ ఆలింగనం

కుక్‌తో కెసిఆర్ ఆలింగనం

తెలంగాణ పారిశ్రామిక విధానం తమను అమితంగా ఆకర్షించిందని, భారత్‌ పర్యటనలో తాను కలుస్తున్న తొలి సీఎం కేసీఆరేనని అన్నారు. తెలంగాణతో చిరకాల స్నేహాన్ని కోరుకుంటున్నామన్నారు. యాపిల్‌ కేంద్రం వచ్చే సెప్టెంబరునాటికి సిద్ధమవుతుందని, పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాక ఐదు వేల మందికి ఉపాధి కలుగుతుందని కుక్‌ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+