ఇలాంటి రాజకీయాలు చేసే ఇప్పుడు ఫాంహౌస్‌లో కూర్చోవాల్సి వచ్చింది!!

రాజకీయాల్లో గండర గండడుగా, ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేసేలా ఎత్తులు, పై ఎత్తులు వేయగలడంటూ పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కొన్నాళ్లుగా కాలం కలిసిరావడంలేదు. అన్నీ ఎదురుదెబ్బలే. వేల సంఖ్యలో పుస్తకాలు చదివానని చెప్పేవారు కాబట్టి ఆ పుస్తకంలో ఎక్కడో ఒకచోట మన టైం బాగోలేనప్పుడు మౌనంగా కూర్చోవాలి అని రాసివుంటుంది. దాన్ని కేసీఆర్ అనుసరిస్తున్నట్లుగా అర్థమవుతోంది.

అధికారంలో ఉన్నప్పుడు తనను మించి రాజకీయం చేసేవారు దేశంలో లేరు అన్నట్లుగా ఉండేవారు. అధికారం పోయిన తర్వాత చాలామంది ఉన్నారని అర్థమైంది. అందుకు ఉదాహరణ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక రెండు సంవత్సరాలుగా అసెంబ్లీకి కూడా రావడంలేదు.అంటే రేవంత్ ది ఆయన స్థాయి కాదంట అని కాంగ్రెస్ శ్రేణులు వ్యంగ్యంగా మాట్లాడుకుంటుంటాయి.

KCR who practices such politics now has to sit in his farmhouse

ముందుగానే కలొచ్చిందా ఏమిటి?
ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత పోటీచేస్తున్నారు కదా. ఒకవేళ ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే ఎందుకైనా మంచిదంటూ పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డితో మరో నామినేషన్ వేయించారు. ఇలాంటి రాజకీయాలు, ఎత్తులు వేసే ఇప్పుడు ఫాంహౌస్ లో కూర్చున్నారు. మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని ఆయన ఎలా భావించారు? ముందగానే కలొచ్చిందా? అని బీఆర్ఎస్ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. తిరస్కరణకు గురవకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకొని నామినేషన్ వేయించడానికి ఆ పార్టీలో నాయకులెవరూ లేరా? నిజంగా ఆమెనే నిలబట్టాలనుకుంటే సునీత కుటుంబంలని మరో వ్యక్తి చేత నామినేషన్ వేయించవచ్చు కదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆయన పోటీచేసినప్పుడు బలహీనమైన అభ్యర్థి కాదా?
సునీత, కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న నవీన్ యాదవ్ కు పోటీ ఇవ్వలేదని భావించిన కేసీఆర్ చివరి నిముషంలో విష్ణువర్థన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అభ్యర్థిని ఒకసారి ప్రకటించినప్పుడు పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించి గెలుపునకు వ్యూహాలు రచించుకొని అమలు చేయాలి. అభ్యర్థి బలంగా ఉంటే ఓడిపోయిన సందర్భాలు రాజకీయాల్లో లేవా? అభ్యర్థి బలహీనంగా ఉన్నా ఘనవిజయం సాధించిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి కేసీఆర్ పోటీచేసినప్పుడు ఆయనేమైనా బలమైన అభ్యర్థా? ఎన్టీఆర్ బలంపై గెలుపొందాడు కదా అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా గుర్తుచేస్తున్నాడు. చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+