హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైద్రాబాద్ మెట్రో రైలు: కియోలిస్‌కు బాధ్యతలు, కారణమిదే

హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కియోలిస్‌ ఇంటర్నేషనల్‌కు అప్పగించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కియోలిస్‌ ఇంటర్నేషనల్‌కు అప్పగించింది.ఈ ప్రాజెక్టును చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ నిర్మాణం పనులకే పరిమితం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 15 నగరాల్లో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలో 15 ఏళ్ల అనుభవం ఉన్న కియోలిస్‌ ఇంటర్నేషనల్‌కు మెట్రో రైళ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.

హైద్రాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కావడం గమనార్హం.

హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తయ్యాయి. ఈ పనులను ప్రారంభించేందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానమంత్రి మోడీకి ఆహ్వనం పంపారు. అయితే రెండో దశ పనులను కూడ వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

మెట్రో రైళ్ళ నిర్వహణ బాధ్యత కియోలిస్‌కు అప్పగింత

మెట్రో రైళ్ళ నిర్వహణ బాధ్యత కియోలిస్‌కు అప్పగింత

హైద్రాబాద్ మెట్రో రైలు నిర్వహణను కియోలిస్‌ ఇంటర్నేషనల్‌కు అప్పగించారు.ప్రపంచ వ్యాప్తంగా 15 నగరాల్లో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలో 15 ఏళ్ల అనుభవం ఉన్న కియోలిస్‌ ఇంటర్నేషనల్‌కు మెట్రో రైళ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. కియోలిస్‌ కంపెనీని నమోదు చేసి, ఉద్యోగుల నియామకాలు చేపట్టింది. రెండు వేల మంది ఉద్యోగులను ఇప్పటికే నియమించుకొని పూర్తి స్థాయిలో సిద్దంగా ఉంది.

Recommended Video

Hyderabad Metro rail :Sky ways between metro rail stations సింగపూర్‌ లాగానే...| Oneindia Telugu
మెట్రో రైలు తొలి దశ పూర్తి చేసేందుకే ఎల్ అండ్ టీ దృష్టి

మెట్రో రైలు తొలి దశ పూర్తి చేసేందుకే ఎల్ అండ్ టీ దృష్టి

ఎల్‌ అండ్‌ టీ పూర్తిగా మొదటి దశలో నిర్మిస్తున్న 72 కిలోమీటర్ల కారిడార్‌ పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సంస్థ మెట్రో రైళ్ల నిర్వహణను చేపట్టడంతో ఆ స్థాయిలో ప్రయాణికులకు సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఎల్‌ అండ్‌టీ చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండేలా మెట్రో రైళ్ల నిర్వహణను చేపట్టనున్నారు.

కియోలిస్‌ చరిత్ర ఇదీ

కియోలిస్‌ చరిత్ర ఇదీ

కియోలిస్‌ సంస్థ ఇప్పటికే ఇప్పటికే ప్యాసింజర్‌ రైళ్లను, ట్రామ్‌వేస్‌, బస్‌ నెట్‌ వర్క్‌ను, ట్రాలీ బసెస్‌, ఎయిర్‌పోర్టు సర్వీసులను నడపంలో ఎంతో అనుభవం కలిగి ఉంది. ప్రభుత్వ పరంగా హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ గ్రేటర్‌ వాసులకు మెట్రో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకుంటుంది.కియోలిస్‌లో 70 శాతం వాటా ఫ్రెంచ్‌ నేషనల్‌ రైల్వే కార్పొరేషన్‌కు ఉంది. 30 శాతం వాటా క్యూబెక్‌ డిపాజిట్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌కు ఉంది. 54600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్రాన్స్‌, అస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చైనా, డెన్మార్క్‌, జర్మనీ, ఇండియా, లక్సెంబర్గ్‌, నెదర్లాండ్‌, నార్వే, పోర్చుగల్‌, స్వీడన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది.

కియోలిస్‌లో తొలి ఇండియన్ సందీపకుమార్‌బతా

కియోలిస్‌లో తొలి ఇండియన్ సందీపకుమార్‌బతా

2012 ఆగస్టులోనే కిలియోస్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. రూ.22 వేల కోట్ల విలువ కలిగిన హైదరాబాద్‌ మెట్రో రైలును, 72 కిలోమీటర్ల మేర 35 సంవత్సరాల పాటు నడిపేందుకు ఎల్‌అండ్‌టీ-రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ బాధ్యతను ఇప్పుడు కియోలీ్‌సకు అప్పగించింది. కియోలీస్‌ సంస్థలో మొట్టమొదటి భారతఉద్యోగిగా ఎంఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సందీ్‌పకుమార్‌బతా ఉన్నారు. హైదరాబాద్‌ మెట్రో నిర్వహణ కోసం ఇప్పటికే 2000 మంది ఉద్యోగులను నియమించుకొని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది

English summary
France-based Keolis has won a contract from L&T Metro Rail , a special purpose vehicle of Indian civil engineering firm Larsen & Toubro, to operate and maintain the new Metro in Hyderabad in India for eight years.The contract includes three years of consultancy and pre operation phase, and also has an option to extend for another three years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X