హైదరాబాద్ లో బెస్ట్ అడ్వెంచర్ ప్లేస్ .. ట్రెక్కింగ్, రాపెల్లింగ్.. మరెన్నో..
నగరంలోని ఫిట్ నెస్, ట్రెక్కింగ్ ఔత్సాహికులకు బెస్ట్ ప్లేస్ గా ల్యాంకో హిల్స్ లోని ఖాజాగూడ నిలుస్తోంది. సాహస ప్రియులకు మరుపురాని అనుభూతిగా ఇక్కడి ప్రదేశం ఉంది. హైదరాబాద్ లోని సాహసికులకు బయటి ప్రదేశాలకు వెళ్లకుండానే ట్రెక్కింగ్, రాపెల్లింగ్, రివర్స్ రాపెల్లింగ్.. లాంటి ఎన్నో సాహసోపేతమైన జర్నీలకు వేదికగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ రాపెల్లింగ్ నేర్చుకోవడానికి ఎక్కువ మంది యువత, పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. రాపెల్లింగ్ పై బిగినర్స్ కు ఇక్కడ వీకెండ్ సెషన్స్ ఉంటాయి.
ఫ్రీక్ అవుట్ అడ్వెంచర్ సొల్యూషన్స్, గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, ట్రెక్స్ అండ్ టెర్రైన్స్ లాంటి పలు కంపెనీలు ఇక్కడ గతంలో రాపెల్లింగ్ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. కేవలం రూ. 300 రిజిస్ట్రేషన్ ఫీజుతో ఇక్కడ రాపెల్లింగ్ నేర్పిస్తారు. మణికొండ ప్రాంతంలోని ల్యాంకో హిల్స్ లో ఖాజాగూడ హిల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో బౌల్డర్స్ , చెరువులు, గుహలు కూడా ఉన్నాయి. ఖాజాగూడలో ట్రెక్కింగ్, రాపెల్లింగ్ మాత్రమే కాకుండా టూరిస్ట్ అట్రక్షన్ గానూ మారింది. ఇక్కడి కొండల మీదనుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలను చూసేందుకు చాలామంది వస్తుంటారు.

రాపెల్లింగ్ లేదా రివర్స్ రాపెల్లింగ్ ను ఎక్కువగా ఇండియన్ ఆర్మీ వినియోగిస్తుంటారు. రాపెల్లింగ్ ను సైకాలాజికల్ అప్లికేషన్ గానూ చెబుతారు. రాపెల్లింగ్ ద్వారా యువతలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. అలాగే ఇక్కడ వాటర్ రాపెల్లింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300 ఉంటుంది. రాపెల్లింగ్ కు వచ్చేవాళ్లు.. లైట్ కలర్ ఫుల్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకోవాలి. టీ-షర్ట్స్ ధరించాలి. స్పోర్ట్ షూస్ వేసుకోవాలి. సన్ క్యాప్ పెట్టుకోవాలి. అలాగే 2 బాటిల్స్ వాటర్ తెచ్చుకోవాలి. అలాగే ఫ్రూట్స్, జ్యూసులు కూడా తీసుకునిరావచ్చు. అలాగే రాపెల్లింగ్ చేసేటప్పుడు మొబైల్ వినియోగం చేయకూడదు. ఇక ఇటీవలి కాలంలో ఖాజాగూడలో రాపెల్లింగ్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ వైరల్ కావడంతో సాహస ఔత్సాహికుల తాకిడి పెరిగింది. చిన్న పిల్లలు సైతం ట్రెక్కింగ్, రాపెల్లింగ్ చేసేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications