యువత దూరంగా ఉండాలి: కికి ఛాలెంజ్‌పై హైదరాబాద్ పోలీస్ సీరియస్, నటి రెజీనాకు క్లాస్

Recommended Video

    వెరీ డెంజరస్: కెనడా టు రెజినా: ఏమిటీ కికి ఛాలెంజ్

    హైదరాబాద్: కికి ఛాలెంజ్ పైన నగర పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఎవరైనా కికి ఛాలెంజ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఇప్పటికే పలుచోట్ల కికి ఛాలెంజ్‌కు పాల్పడినట్లుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. నిర్మానుష్య ప్రాంతాల్లోని రోడ్లపై యువత కికి ఛాలెంజ్ చేస్తున్నారని తెలుస్తోందన్నారు.

    కికి ఛాలెంజ్‌కు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రముఖుల కికి ఛాలెంజ్‌తో యువతలో క్రేజ్ పెరుగుతోందన్నారు. నగర రోడ్లపై కికి ఛాలెంజ్ అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కికి ఛాలెంజ్ విసిరిన సినీ నటి రెజీనాకు పోలీసులు క్లాస్ పీకారని తెలుస్తోంది. కికి ఛాలెంజ్ విసిరితే చర్యలు తప్పవన్నారు.

    Kiki dont love you, says Hyderabad city police

    కికి ఛాలెంజ్‌లో యువతలో క్రేజ్ పెరుగుతోంది. ముంబై సహా ఉత్తర భారతంలో దీనిని పలువురు చేస్తూ, సవాల్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు కూడా పాకినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో యువతను అప్రమత్తం చేస్తున్నారు. దీనికి దూరంగా ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

    నటి రెజీనా కికి ఛాలెంజ్

    నటి రెజినా కికి ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు ఆమె ఈ నెల దీనిని ప్రదర్సించి జూలై 29వ తేదీన తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+