కోమటిరెడ్డి-సంపత్‌ల కేసు: కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లు శాసన సభ్యత్వాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మంగళవారం ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది.
ఎమ్మెల్యేలుగా గుర్తించాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై రెండు నెలలు స్టే విధించింది. హైకోర్టు చరిత్రలోనే తొలిసారిగా అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సింగిల్ బెంచ్. వారి శాసన సభ్యత్వం విషయంలో సాంకేతికంగానే 61 రోజులు ఆలస్యం జరిగిందని డివిజన్ బెంచ్‌కు ప్రభుత్వం తెలిపింది.

వారం రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌ల అనర్హత పిటిషన్ కేసులో హైకోర్టు మంగళవారం పలువురికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ సహా సెక్రటరీ, లా సెక్రటరీలకు ఫాం 1 నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 17వ తేదీన నేరుగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ స్పీకర్‌కు కూడా హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్‌మెన్లను కేటాయించని కారణంగా డీజీపీ, గద్వాల, నల్గొండ ఎస్పీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఎవరు ధిక్కరించినా శిక్షార్హులేనని హైకోర్టు పేర్కొంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలను, అలాగే అసెంబ్లీ రిజిస్టర్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు వెళ్లగా, ఇప్పుడు స్టే విధించింది. ఇది రెండు నెలల పాటు అమలవుతుందని తెలిపింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications