జగన్ -కేసీఆర్ కుమ్మక్కు వల్లే అలా..! మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ ..!

ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఇవాళ సంచలన విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తన పదేళ్ల పాలనలో చేసిన ఘోరాల వల్లే తెలంగాణ ప్రస్తుతం జల సమస్యలు ఎదుర్కుంటోందని కోమటిరెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys Jagan)తో కుమ్మక్కై కేసీఆర్ (KCR) తెలంగాణకు తీరని నష్టం చేశారని విమర్శించారు. ఆయన చేసిన పాపం వల్ల ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీ తరలించుకుపోతోందన్నారు.

మోడీ స్వరాష్ట్రంలో బీజేపీకి వరుస షాక్ లు..! అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓటములు..!
మోడీ స్వరాష్ట్రంలో బీజేపీకి వరుస షాక్ లు..! అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓటములు..!


తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఘోరాల వల్ల కరువు వచ్చినా శ్రీశైలం నుంచి నీరు తీసుకోలేని పరిస్ధితి ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం సామర్ధ్యం పెంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకుపోయే అవకాశం ఇచ్చారన్నారు. ఆయన అప్పట్లో చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు రోజూ 10 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రభుత్వం తీసుకుపోతోందని కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ చేసిన తప్పిదానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

Komatireddy Venkat Reddy Targets KCR Over YS Jagan s Rayalaseema Lift Irrigation Project
UCC పై కేంద్రం బిగ్ ప్లాన్? పార్లమెంట్ చేయాల్సిన పని అసెంబ్లీలతో ఎందుకంటే?
UCC పై కేంద్రం బిగ్ ప్లాన్? పార్లమెంట్ చేయాల్సిన పని అసెంబ్లీలతో ఎందుకంటే?

2028 జూన్ నాటికి శ్రీశైలం సొరంగాన్ని పూర్తి చేసి డెడ్ స్టోరేజ్ ఉన్నా 4 లక్షల క్యూసెక్కుల నీళ్ళు అందించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. దీని కోసం నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మరోవైపు జగన్ కు సన్నిహితుడిగా పేరున్న మంత్రి కోమటిరెడ్డి.. ఇలా కేసీఆర్ ను తిట్టే క్రమంలో ఆయన్ను లాగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+