వరంగల్ కోటలోనే 'కొండా' పాగా: పాదయాత్రలో కొండా ఫ్యామిలీ సెన్సేషన్!!

నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ మురళి, కొండా సురేఖ దంపతులతో పాటు, ఆయన కుమార్తె కొండా సుస్మిత పటేల్ పాదయాత్రలో పాల్గొన్నారు. కొండా సురేఖ కుటుంబం ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన కొండా సురేఖ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాం

నేడు హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ మురళి, కొండా సురేఖ దంపతులతో పాటు, ఆయన కుమార్తె కొండా సుస్మిత పటేల్ కూడా పాల్గొన్నారు. వరంగల్లోని 12, 13 డివిజన్ లలో పాదయాత్ర నిర్వహిస్తున్న కొండ దంపతులు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం గత ఎన్నికల సమయంలో వదిలిపెట్టి చాలా తప్పు చేశామని, అనవసరంగా పరకాల నుంచి ఎన్నికల్లో పోటీ చేశామని వారి పేర్కొన్నారు.

ఇక నుండి వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉంటాం

ఇక నుండి వరంగల్ ప్రజలకు అందుబాటులో ఉంటాం

చెప్పుడు మాటలు విని మీకు దూరంగా ఉన్నామని పేర్కొన్న కొండ ఫ్యామిలీ, గతంలో కొండ సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుత నియోజకవర్గ పరిస్థితికి మధ్య వ్యత్యాసం చూడాలన్నారు. వరంగల్ తూర్పున భూకబ్జాలు బాగా పెరిగాయని, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇకనుంచి ఎప్పటిలాగే నియోజకవర్గ ప్రజలకు తాము అందుబాటులో ఉంటామని, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి స్థానికంగా ఉండి పనిచేస్తామని కొండ దంపతులు వెల్లడించారు.

బీఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా: కొండా సురేఖ సవాల్

బీఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా: కొండా సురేఖ సవాల్


తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజక వర్గం అభివృద్ధి చెందిందని పేర్కొని, బీఆర్ఎస్ నాయకులకు ధైర్యం ఉంటే తాము చేసిన అభివృద్ధిపై బొడ్రాయి సాక్షిగా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కొండా సురేఖ . కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడద్దని, ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎప్పుడైనా సరే కొండా దంపతులు మీ ముందు ఉంటారని వారు కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికలకు పాదయాత్రతో రంగంలోకి దిగిన కొండా ఫ్యామిలీ

వచ్చే ఎన్నికలకు పాదయాత్రతో రంగంలోకి దిగిన కొండా ఫ్యామిలీ

ఇక ఇదే సమయంలో కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బి ఆర్ ఎస్ అంటే భారత రాబందుల పార్టీ అని, రాష్ట్రాన్ని దోచుకోవడం పూర్తయి, ఇప్పుడు దేశం మీద పడ్డారని కొండా సురేఖ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కొండా మురళి పని రాక్షసుడు అని సుస్మిత పటేల్ కితాబిచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండే నాయకులు కొండ ఫ్యామిలీ అని సుస్మిత పటేల్ పేర్కొన్నారు. మొత్తానికి పాదయాత్రతో వరంగల్ తూర్పు నియోజకవర్గం లో రీఎంట్రీ ఇచ్చిన కొండ ఫ్యామిలీ, వచ్చే ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+