మరో కోకాపేటగా శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఆ ప్రాంతం..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం క్రమంగా విస్తరిస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి గణనీయమైన అభివృద్ధిని చూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని దక్షిణ ప్రాంతం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దక్షిణ భాగంలోని ఆదిభట్ల, కొంగర్ కలాన్, మహేశ్వరం, బొంగులూరు గేట్, తుక్కుగూడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి.

హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భాగ్యనగరంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో ఐటీ రంగం, ఫార్మారంగంతోపాటుగా రియల్ ఎస్టేట్ రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గత పదేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొండాపూర్ ప్రాంతాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. ఇక హైదరాబాద్ లో దాదాపు అన్ని అంతర్జాతీయ కంపెనీలు నెలకొని ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్,టీసీఎస్, ఇన్ఫోసిస్,అమెజాన్, మెటా.. తదితర సంస్థలు ఏర్పడ్డాయి.

అయితే హైదరాబాద్ లోని మిగతా ప్రాంతాల మాదిరిగానే ప్రస్తుతం నగరంలోని దక్షిణ భాగంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. దక్షిణ హైదరాబాద్ లోని ఆదిభట్ల, కొంగర్ కలాన్, మహేశ్వరం, బొంగులూరు గేట్, తుక్కుగూడ.. తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి.

Kongara Kalan The Next Kokapet Shamshabad s Emerging Real Estate Hotspot

కొంగర్ కలాన్ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ అయిన ఫాక్స్ కాన్ అతిపెద్ద పరిశ్రమను నిర్మిస్తోంది. ఈ ప్రాంతానికి శంషాబాద్ ఎయిర్ పోర్టు అత్యంత సమీపంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఐటీ రంగ పరిశ్రమలు, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే కొంగర్ కలాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం కూడా విస్తరిస్తోంది. అటు శ్రీశైలం హైవేకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే కొంగర్ కలాన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి. అయితే హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే ఈ ప్రాంతంలో ధరలు కాస్త తక్కువగా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+