ఓటమి భయంతోనే కేటీఆర్ ఆరోపణలు; మునుగోడులో టీఆర్ఎస్ పరిస్థితిపై వివేక్ వెంకట స్వామి చెప్పిందిదే!!
మునుగోడులో అధికార టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడిన వివేక్ వెంకటస్వామి, ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డి పై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్ ల కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్న ఆయన మునుగోడు లో టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. సొంత కార్యకర్తలను కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి లో టిఆర్ఎస్ పార్టీ ఉందని వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంది. తాజాగా మంత్రి కేటీఆర్ మునుగోడు ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టార్గెట్ చేసి క్విడ్ ప్రో కో ఆరోపణలు చేయడంపై బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ కోల్ మైన్స్ బ్లాక్స్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు.

ఓటమి భయంతోనే కేటీఆర్ కోమటిరెడ్డిపై ఆరోపణలు: వివేక్ వెంకటస్వామి
మునుగోడులో అధికార టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడిన వివేక్ వెంకటస్వామి, ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డి పై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్ ల కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్న ఆయన మునుగోడు లో టిఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైందని తెలిపారు. సొంత కార్యకర్తలను కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి లో టిఆర్ఎస్ పార్టీ ఉందని వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు.

ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరపాలని ఈసీని కోరామన్న వివేక్
ఇక మునుగోడు ఉప ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని వివేక్ వెంకటస్వామి తెలిపారు. మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమానికి కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్, తరుణ్ చుగ్, బండి సంజయ్ తో పాటు బిజెపి ముఖ్య నేతలు హాజరవుతారని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు

తాడిచర్ల మైనింగ్ లో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి
ఇక తాడిచర్ల మైనింగ్ విషయంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే తాడిచర్ల మైన్స్ ను కెసిఆర్ ప్రభుత్వం ఏఎమ్మార్ కు అప్పగించిందని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని వల్ల 20 వేల కోట్ల రూపాయలు జెన్కో, మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం నష్టపోయిందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం తీరు వల్లే జెన్ కో సంస్థ నష్టాల్లో కూరుకు పోయిందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications