కేటీఆర్ విచారణ వేళ ఉత్కంఠ పరిణామాలు..!!
ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ వేళ ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ సమన్ల మేరకు విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ వచ్చారు. కానీ, ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. కేటీఆర్ వెంట న్యాయవాదులు వెళ్ళకూడదంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీని పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏసీబీ అధికారు లకు లేఖ ఇచ్చి కేటీఆర్ వెళ్లిపోయారు. దీంతో, ఇప్పుడు ఏసీబీ ఏం చేస్తుందనేది ఉత్కంఠ పెంచుతోంది.
ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ కోసం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ లీగల్ టీం ఉంది. కేటీఆర్ వెంట న్యాయవాదులు వెళ్ళటాన్ని పోలీసులు అభ్యం తరం వ్యక్తం చేసారు. కారును అడ్డుకున్నారు. దీని పైన మండిపడ్డ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు ముఖ్యమంత్రి రేవంత్ ఇలాంటి పనులతో సాధించేది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున విచారణ అవసరం ఏంటని ప్రశ్నించారు. చట్టానికి గౌరవించే పౌరుడిగా ఏసీబీ విచారణకు వచ్చానని చెప్పుకొచ్చారు. కోర్టులో విచారణ తర్వాత వస్తానని చెప్పి తప్పించుకో వచ్చని వ్యాఖ్యానించారు. కానీ తప్పించుకోను.

తమ లాయర్లను అడ్డుకోవటం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. లాయర్‌తో విచారణకు వస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కుట్ర చేశారని చెప్పుకొచ్చారు. రేవంత్ డైరెక్షన్‌లో ఆయన ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా తన పేరును చెప్పి ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తను కూడా చెప్పని స్టేట్‌మెంట్‌ను చెప్పిన ట్టుగా చేస్తారని భావించే న్యాయపరమైన మద్దతు ఉండాలనే లాయర్ తో వచ్చినట్లు వివరించారు. కొద్ది రోజులు అల్లు అర్జున్ డ్రామా.. ఆపై కేటీఆర్‌పై కేసు డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ చేసి టైంపాస్ చేయడమే వీరి ఉద్దేశంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏసీబీకి లేఖ ఇచ్చిన కేటీఆర్ ఆ వెంటనే పార్టీ కార్యాలయంకు వెళ్లిపోయారు. విచారణ అధికారులకు ఏం పత్రాలు కావాలో సూచిస్తే..తాను అందిస్తానని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టులో తీర్పు రిజర్వ్ చేసారని.. అది వచ్చే వరకు తన విచారణ వాయిదా వేయాలని కేటీఆర్ కోరారు. తనకు పోలీసుల పైన నమ్మకం లేదని చెప్పారు. తన ఇంటి పైన దాడులకు ఏసీబీ సిద్దమైందని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ అక్కడ నేతలతో చర్చలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏం చేయబోతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications