కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ : చిరు - చెర్రీ..మహేష్ విషెస్ : విజయ సాయిరెడ్డి సైతం..!!
తెలంగాణ మంత్రి...టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు..వరదల కారణంగా జన్మదిన వేడుకలకు కేటీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించారు. తన జన్మదినం నాడు వరదలతో ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయటమే అభిమానులు తనకు ఇచ్చే బహుమతి అని కేటీఆర్ నేతలకు సూచించారు. అదే సమయంలో తన కాలికి గాయం కావటంతో విశ్రాంతికే పరిమితం కానున్నట్లు ట్వీట్ చేసిన కేటీఆర్.. ఓటీటీలో ఏ సినిమా చూడాలో సలహా ఇవ్వాలని కోరారు.
పార్టీ కార్యాలయంలో వేడుకలు
ఇక, ఈ రోజు పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా.. మంత్రి కేటీఆర్‌పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రం (స్యాండ్ ఆర్ట్), త్రీడీ ప్రదర్శ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక, మెగాస్టార్ చిరంజీవి కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేసారు.
సాయిరెడ్డి స్పెషల్ ట్వీట్
డియర్ రాం హ్యాపీ బర్త్ డే తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ తో ఉన్న ఫొటోను షేర్ చేసారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతల విజయ సాయిరెడ్డి మంత్రి కేటీఆర్ కు విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ లో ..తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా...అంటూ పేర్కొన్నారు.
మెగాస్టార్..టాలీవుడ్ హీరోల విషెస్
హీరో మహేష్ బాబు.. రవితేజ .. సోనూసూద్ సైతం కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. వారందిరకీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు.. ప్రజాప్రతినిధులు సైతం కేటీఆర్ కు విషెస్ చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇక, ఒక అభిమాని వినూత్నంగా హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ నేత పీవీపీ సైతం కేటీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు.












Click it and Unblock the Notifications