కేటీఆర్ జన్మదినం.!అంబరాన్నంటుతున్న సంబరాలు.!
హైదరాబాద్ : తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు లాంగ్ లీవ్ నినాదాలతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మారుమోగింది. కేటీఆర్ జన్మదినం సందర్బంగా హాట్టాహాసంగా తెలంగాణ ట్రై క్రీడా 2023 వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కే తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా సోమవారం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు ముఖ్య నేతలు. ఈ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ అతిధులుగా హాజరైయ్యారు.
తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకల : పీవి మార్గ్ లోని థ్రిల్ సిటీలో సోమవారం ఉదయం తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకల కార్యక్రమాలు థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లోనీ ప్రపంచ అతిపెద్ద తెరపై మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా త్రీడీ లో వినూత్నంగా విషెస్ తెలుపుతూ వీడియోను ప్రదర్శించారు.

మంత్రి కేటీఆర్ ఔనత్యాన్ని, వ్యక్తిత్వం, పోరాటపటిమ, పరిపాలన విధానం, సాధించిన విజయాలను క్రోడీకరిస్తూ ప్రత్యేక విడియో సాంగ్ ను ప్రదర్శించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం క్రింద వీడియో కెమెరా మెన్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేసిన భారీ కేక్ ప్రముఖుల సమక్షంలో కట్ చేసారు గులాబీ నేతలు.


-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications