హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి: కెటిఆర్ చేయూత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అటెండర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత సాధించిన నర్సింహులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన దళిత యువకుడు నర్సింహులు.

అటెండర్‌గా పనిచేస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అతను అర్హత సాధించాడు. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన నర్సింహులు పట్టుదల ఇతరులకు స్ఫూర్తి ఇస్తుందని తెలంగాణ మంత్రి కెటి రామారావు అన్నారు.

నర్సింహులు పిలిపించుకుని...

నర్సింహులు పిలిపించుకుని...

నర్సింహులును కెటిఆర్ శుక్రవారం తన వద్దకు పిలిపించుకున్నారు. అతనికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వచ్చే ఏడాదికల్లా డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. నర్సింహులు పట్టుదల మరింత మందికి స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు.

 నర్సింహులు నేపథ్యం ఇదీ.

నర్సింహులు నేపథ్యం ఇదీ.

తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన దళిత యువకుడు పిట్లా నర్సింహులు అంగవైకల్యాన్ని అధిగమించి పిజి వరకు చదువుకున్నాడు. అయితే, తల్లిదండ్రులు ముసలివారు కావడంతో వల్ల, పెళ్లీడుకొచ్చిన చెల్లెళ్లు నలుగురు ఉండడం వల్ల కుటుంబ పో,న్ కోసం ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 గ్రామసభలో పాల్గొనడానికి కెటిఆర్ వచ్చినప్పుడు

గ్రామసభలో పాల్గొనడానికి కెటిఆర్ వచ్చినప్పుడు

గ్రామసభలో పాల్గొనడానికి ఓ రోజు వచ్చిన కెటిఆర్‌ను నర్సింహులు కలిశాడు. తన పరిస్థితిని మంత్రికి వివరించాడు. దాంతో సిరిసిల్లలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మంత్రి అతనికి చిన్న ఉద్యోగం ఇప్పించాడు. ఏ సహాయం కావాలన్నా చేస్తానని, ఇంకా చదువుకోవాలని కెటిఆర్ అతనికి ఆ సందర్భంలో చెప్పారు.

మంత్రి మాట ప్రకారం...

మంత్రి మాట ప్రకారం...

మంత్రి మాట ప్రకారం నర్సింహులు పిజీ పూర్తి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి జరిగిన అర్హత పరీక్షలో పాసయ్యాడు. అంతేకాకుండా జూనియర్ రీసెర్స్ ఫెలోషిప్ సాధించాడు. ఐ విషయం తెలిసి కెటిఆర్ నర్సింహులును తన వద్దకు శుక్రవారంనాడు పిలిపించుకుని ఆర్థిక సాయం చేసారు. వచ్చే దసరా నాటికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు.

జీవితాంతం రుణపడి ఉంటా...

జీవితాంతం రుణపడి ఉంటా...

తన కుటుంబాన్న్ి పోషించుకోవడానికి ఉద్యోగం ఇప్పించిన మంత్రి కెటీఆర్‌కు, ఉద్యోగం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ చైతన్య కుమార్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని నర్సింహులు చెప్పాడు.

English summary
Dalit youth Narsimhulu, attender passed the exam of assistant proffessor job. Telangana minister KT Rama Rao extended financial assistance to Narasimhulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X