హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎక్కడికెళ్లినా ప్రశంసలే: సిలికాన్ వ్యాలీని కట్టిపడేసిన కెటిఆర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఎక్కడికెళ్లినా ప్రశంసలు లభిస్తున్నాయని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో టాయ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ 'పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు- తెలంగాణ ప్రభుత్వ విధానాలు' అనే అంశంపై ప్రసంగించారు. అత్యుత్తమ విధానాలు, వినూత్న ఆలోచనలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తొందని తెలిపారు. ప్రభుత్వాలు తాత్కాలికం.. ప్రభుత్వ విధానాలు శాశ్వతం అనే విశ్వాసంతో పారిశ్రామిక, వ్యవసాయ, సంక్షేమ రంగాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఎక్కడికెళ్లినా ప్రశంసలు లభిస్తున్నాయని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో టాయ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‘పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు- తెలంగాణ ప్రభుత్వ విధానాలు' అనే అంశంపై ప్రసంగించారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

అత్యుత్తమ విధానాలు, వినూత్న ఆలోచనలతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తొందని తెలిపారు. ప్రభుత్వాలు తాత్కాలికం.. ప్రభుత్వ విధానాలు శాశ్వతం అనే విశ్వాసంతో పారిశ్రామిక, వ్యవసాయ, సంక్షేమ రంగాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

15 రోజుల్లో పరిశ్రమలు అనుమతి ఇస్తున్న విధానంపై మంత్రి వివరించారు. సిలికాన్‌ వ్యాలీ తరహాలోనే హైదరాబాద్‌లో టీ హబ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్‌ వ్యాలీ ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాయని అన్నారు. భారత యువత కూడా కొత్త ఆవిష్కరణల దిశగా వెళ్తొందని చెప్పారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

‘సిలికాన్‌ వ్యాలీలో ఉన్న అనుకూల పరిస్థితుల తరహాలోనే హైదరాబాద్‌లో టి-హబ్‌ను ఏర్పాటు చేశాం. టి-హబ్‌ అవుట్‌పోస్టును సిలికాన్‌ వ్యాలీలో ఏర్పాటు చేస్తాం. టి-హబ్‌ అంకుర పరిశ్రమలకు (స్టార్టప్‌లకు) తోడ్పాటునందించాలని' మంత్రి కెటిఆర్ కోరారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

‘టాస్క్‌ ద్వారా ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇంటింటికీ ఇంటర్నెట్‌ కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కామారెడ్డి లాంటి చిన్న పట్టణాల్లో కూడా బీపీఓ సెంటర్లు ప్రారంభమవుతున్నాయి' అని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌తో పాటు, తయారీ రంగంలోనూ భారత్‌లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు.

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

సిలికాన్ వ్యాలీలో కెటిఆర్

అద్భుతమైన పారిశ్రామిక, ఎలక్ట్రానిక్‌ విధానాలను తెలంగాణ ప్రభుత్వం తెచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేసేందుకు మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయ వంటి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాగా, కెటిఆర్ ప్రసంగానికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు నుంచే గాక ప్రవాస భారతీయుల నుంచి మంచి స్పందన లభించింది.

English summary
Information Technology Minister K. Tarakarama Rao said that leaders were temporary and institutions permanent and Telangana Government has been striving to build institutions for the last two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X