కేటీఆర్ చేతల మనిషి... నెటిజన్ల ప్రశంసలు.. రీజన్ ఇదే!!

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తుంది. కేటీఆర్ మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ ప్రశంసిస్తున్నారు.

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తుంది. కేటీఆర్ మాటల మనిషి కాదు చేతల మనిషి అంటూ, శభాష్ కేటీఆర్ అంటూ నెటిజన్లు ఆయనను తెగ పొగుడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

సడన్ హార్ట్ ఎటాక్ లతో కేటీఆర్ నిర్ణయం..

సడన్ హార్ట్ ఎటాక్ లతో కేటీఆర్ నిర్ణయం..

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సడెన్ హార్ట్ ఎటాక్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఆకస్మిక గుండెపోటు కేసులు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడడానికి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి మన్ననలు పొందేలా చేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉండే కేటీఆర్, సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏది అడిగినా కాదనకుండా చేస్తూ ఉంటారు. కొన్ని సమస్యలను నేరుగానే పరిష్కరిస్తారు. కొన్నింటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి సహకరిస్తారు.

ప్రముఖ కార్డియాలజిస్ట్ కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్

ప్రముఖ కార్డియాలజిస్ట్ కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్


ఇక అటువంటి కేటీఆర్ ఇటీవల హైదరాబాద్లో పేరు ఉన్న ఓ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ మదివాడ గుండెపోటుతో ఇటీవల కాలంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ఒక సూచన చేశారు. హైదరాబాద్ గొప్ప సిటీ అని ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నప్పటికీ ఆకస్మిక గుండె పోటు కేసులు బాగా పెరుగుతున్నాయని, సీపిఆర్ మీద నగర పౌరుల్లో, ప్రభుత్వ సిబ్బంది లోను అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని, పబ్లిక్ ప్లేస్ లలో సిపిఆర్ కిట్లు అత్యవసర మందులు అందించే డెఫిబ్రిలేటర్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంటూ ఆయన కేటీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.

నెలలోనే అన్నది చేసిన కేటీఆర్ .. సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు

నెలలోనే అన్నది చేసిన కేటీఆర్ .. సీపీఆర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు

దీనిపై పాజిటివ్ గా స్పందించిన కేటీఆర్ అలాగే చేద్దాం అంటూ పేర్కొన్నారు. ఆపై నెల రోజుల్లోనే పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బందికి సిపిఆర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి, సిపిఆర్ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక డాక్టర్ సూచన మేరకు 1400 డేఫిబ్రిలేటర్స్ ఆర్డర్ చేశామని త్వరలోనే, పబ్లిక్ ప్లేస్ లలో పెడతామని కేటీఆర్ వెల్లడించారు. దీంతో ప్రతి ఒక్కరు శభాష్ కేటీఆర్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. లీడర్ అంటే అలా ఉండాలని, ప్రతి రాజకీయ నాయకుడు కేటీఆర్ ని చూసి నేర్చుకోవాలని తెగ పొగుడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+